AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Staff: మెడికల్ సిబ్బందికి సరికొత్త రూల్స్.. మేకప్ లో రావొద్దని ఆర్డర్స్.. అంతే కాకుండా..

ఆస్పత్రులకు వచ్చే బాధితులకు చికిత్స అందించడం కోసం పని చేసే సిబ్బంది విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రెస్ కోడ్ విషయంలో పలు నిబంధనలు విధించింది...

Medical Staff: మెడికల్ సిబ్బందికి సరికొత్త రూల్స్.. మేకప్ లో రావొద్దని ఆర్డర్స్.. అంతే కాకుండా..
Medical Staff
Ganesh Mudavath
|

Updated on: Feb 11, 2023 | 3:20 PM

Share

ఆస్పత్రులకు వచ్చే బాధితులకు చికిత్స అందించడం కోసం పని చేసే వైద్య సిబ్బంది విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రెస్ కోడ్ విషయంలో పలు నిబంధనలు విధించింది. హాస్పిటల్స్ లో పని చేసే స్టాఫ్.. ఫంకీ హెయిర్‌స్టైల్‌, భారీ నగలు, మేకప్‌ వేసుకుని డ్యూటీకి రాకూడదని ఆదేశించింది. అలా వస్తే విధులకు అనుమతించమని స్పష్టం చేసింది. అయితే.. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. ఈ డ్రెస్‌కోడ్‌ ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. వీకెండ్స్, నైట్‌ షిప్టుల్లో ఉన్న సిబ్బందికి కూడా ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు. వారికి ఎలాంటి మినహాయింపులు లేవని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది పనివేళల్లో క్రమశిక్షణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. విచిత్రమైన హెయిర్‌స్టైల్, భారీ నగలు, మేకప్‌, పొడవైన గోళ్లు, స్కర్టులు ధరించకూడదు. పురుషులు మోడర్న్‌ హెయిర్‌కట్‌ చేసుకుని రావొద్దు. గోళ్లు శుభ్రంగా ఉంచాలి. టీషర్టులు, జీన్స్‌లు, స్కర్టులు, లెదర్‌ ప్యాంట్లు, క్రాప్‌టాప్‌లు వంటి దుస్తులు ప్రొఫెషనల్‌లా కన్పించవు. అందువల్ల వాటిని అనుమతించబోం. ప్రొఫెషనల్‌గా కన్పించే ఫార్మల్‌ దుస్తులనే ధరించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.

– అనిల్ విజ్, హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్తుల దుస్తులపై ఆంక్షలు ఉన్నాయి. జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆదేశాలు వచ్చాయి. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలని సూచించింది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా జీన్స్ ధరించకూడదని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..