PM Modi: ప్రధాని మోదీకి బార్బడోస్ అత్యున్నత పురస్కారం.. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు గాను..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బార్బడోస్ దేశం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో సమర్థమైన వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన 'గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్' అవార్డును ప్రదానం చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బార్బడోస్ దేశం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో సమర్థమైన వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ‘గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ అవార్డును ప్రదానం చేసింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ తరఫున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెటిటా ఈ అవార్డును అందుకున్నారు.
బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ తరపున విదేశాంగ, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా ఈ అవార్డును అందుకున్నారు.. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డు రెండు దేశాల మధ్య “శాశ్వత స్నేహానికి” ప్రతీక అని MEA తెలిపింది.
ఈ అవార్డును గతేడాది (2024) నవంబర్ 20న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరిగిన 2వ ఇండియా-CARICOM లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ఈ అవార్డు ప్రకటించినట్లు పేర్కొంది.
ప్రధాని మోదీ ట్వీట్..
ఈ అవార్డును ప్రదానం చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు.. ఈ గౌరవానికి బార్బడోస్ ప్రభుత్వానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.. ‘గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ అవార్డును 1.4 బిలియన్ల భారతీయులకు.. భారతదేశం – బార్బడోస్ మధ్య సన్నిహిత సంబంధాలకు అంకితం చేస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు.
Grateful to the Government and the people of Barbados for this honour.
Dedicate the ‘Honorary Order of Freedom of Barbados’ Award to the 1.4 billion Indians and to the close relations between India and Barbados. @DameSandraMason @miaamormottley https://t.co/Ab11qHSAyA
— Narendra Modi (@narendramodi) March 7, 2025
మార్గెరిటా ఏమన్నారంటే..
“కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తించి” ఈ అవార్డును ప్రధానమంత్రి మోడీకి అందజేసినట్లు ప్రకటనలో తెలిపింది. మహమ్మారి సృష్టించిన భయంకరమైన పరిస్థితిలో అంతర్జాతీయ సహకారం, మద్దతును బలోపేతం చేయడంలో మోడీ పోషించిన కీలక పాత్రను మోట్లీ గుర్తించారని పేర్కొంది.
ప్రధానమంత్రి తరపున అవార్డును అందుకున్న మార్గెరిటా.. ఈ గుర్తింపునకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరుఫున ప్రాతినిధ్యం వహించడం, ఆయన తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం ఒక గొప్ప గౌరవం” అని పేర్కొన్నారు.
“ఈ గుర్తింపు భారతదేశం – బార్బడోస్ మధ్య లోతైన సంబంధాలను, అలాగే ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సహకారం, అభివృద్ధికి మా ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతుంది” అని మార్గెరిటా చెప్పారు.
1966లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుండి, భారతదేశం – బార్బడోస్ నిరంతర సహాయసహకారాలు, అభివృద్ధి చొరవల ద్వారా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నాయని ప్రకటనలో విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
