AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఉమెన్స్‌ డే సందర్భంగా ఆసక్తికర విషయం బయటపెట్టిన ప్రధాని మోదీ!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రధాని, ప్రతి సంఘటనకు తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. ఈ విషయంలో మహిళల పాత్రను ప్రధాని ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

PM Modi: ఉమెన్స్‌ డే సందర్భంగా ఆసక్తికర విషయం బయటపెట్టిన ప్రధాని మోదీ!
Pm Modi
SN Pasha
|

Updated on: Mar 08, 2025 | 11:39 AM

Share

ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహించేది మహిళలే అంటూ వెల్లడించారు. ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటే ప్రధాని, ప్రతి సంఘటనపై ఎప్పటి కప్పుడు తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా తన స్పందనను తెలియజేస్తూ ఉంటారు. అయితే అది ఆయనే స్వయంగా వాడరు. ఆయనకంటూ ప్రత్యేక సిబ్బంది ఉంటారు. వాళ్లు మోదీ ఆదేశాల మేరకు పోస్ట్‌లు చేస్తూ వాటిని మెయిటేన్‌ చేస్తూ ఉంటారు.

అలా తన ఖాతాలను మెయిటేన్‌ చేసే వారంతా మహిళలే అంటూ మోదీ తెలిపారు. ఈ సందర్భంగా నారీశక్తికి వందనం అంటూ ప్రధాని మోదీ దేశ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభత్వం మహిళా సాధికారితకు కృషి చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖ మహిళలు ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్ నుంచి దేశ మహిళలకు ప్రత్యేక సందేశాలు ఇచ్చారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత, మహిళా అథ్లెట్లకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతపై మంచి సందేశాన్ని అందించడానికి భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. “వనక్కం! మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్రాపర్టీస్‌ను మహిళా దినోత్సవం నాడు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను చెస్ ఆడతాను. పలు టోర్నమెంట్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది.” అని వైశాలి పేర్కొన్నట్లు ప్రధాని మోదీ ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపారు.

వైశాలితో పాటు మరో ఇద్దరు సైంటిస్టులు కూడా ప్రధాని మోదీ అకౌంట్ నుంచి తమ సందేశాన్ని ఉమెన్స్ సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చారు.  అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోనిలు ప్రధాని మోడీ ఎక్స్‌ అకౌంట్లో పోస్ట్‌ చేస్తూ.. “అంతరిక్ష సాంకేతికత, అణు సాంకేతికతలో మహిళా సాధికారత. మేము అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోని, మహిళా దినోత్సవం నాడు ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్రాపర్టీలకు నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. సైన్స్‌కు ఇండియా అత్యంత ఉత్సాహభరితమైన ప్రదేశం, ఈ రంగంలో మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

నోట్‌: ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్‌లో ఉమెన్స్‌ డే సందర్భంగా పోస్ట్‌లు చేసిన వారి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..