AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Commemoration Day 2021: పోలీసు అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళి..

Police Commemoration Day 2021: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఇవాళ(గురువారం) ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Police Commemoration Day 2021: పోలీసు అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళి..
Pm Narendra Modi
Janardhan Veluru
|

Updated on: Oct 21, 2021 | 10:52 AM

Share

Police Commemoration Day 2021: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఇవాళ(గురువారం) ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలు, పోలీసుల సేవలను గుర్తుచేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు బలగాల సేవలు అమోఘమని కొనియాడారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలను విస్మరించలేమని చెప్పారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Also Read..

100 Crore Vaccination: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..

Viral News: ఆశగా చిప్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు…తెరచి చూస్తే షాక్‌ అయ్యాడు…