PM Narendra Modi: దేవభూమిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి.. ప్రజలను అభినందించిన ప్రధాని మోదీ..
Uttarakhand Covid-19 Vaccination: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వందకోట్ల
Uttarakhand Covid-19 Vaccination: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వందకోట్ల మార్క్ దాటనుంది. ఈ క్రమంలో దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ తరుణంలోనే దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం.. అర్హత ఉన్న ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ అందించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజలను అభినందించారు. కోవిడ్‌పై పోరాటంలో ఉత్తరాఖండ్ సాధించిన ఈ విజయం ముఖ్యమైనదంటూ ఆయన ట్విట్ చేశారు. “దేవభూమి ప్రజలకు అభినందనలు. దేశంలో కోవిడ్‌పై పోరాటంలో ఉత్తరాఖండ్ సాధించిన ఈ విజయం చాలా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిని ఎదుర్కోవడంలో టీకా అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.. దీనిలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్‌కు.. రీట్విట్ చేశారు.
देवभूमि के लोगों को बहुत-बहुत बधाई। कोविड के खिलाफ देश की लड़ाई में उत्तराखंड की यह उपलब्धि अत्यंत महत्वपूर्ण है। मुझे विश्वास है कि वैश्विक महामारी से लड़ने में हमारा वैक्सीनेशन अभियान सबसे अधिक प्रभावी साबित होने वाला है और इसमें जन-जन की भागीदारी अहम है। https://t.co/FdfkPWr6dC
— Narendra Modi (@narendramodi) October 18, 2021
ఈ చారిత్రాత్మక ఘనత సాధించడంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ట్విట్ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ అందించింది. దేశంలో అందరికీ మొదటి డోస్ అందించిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.. రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు.. అంటూ ధామి ట్విట్ చేశారు.
కాగా.. సోమవారం మధ్యాహ్నం 2:30 వరకు కోవిన్ డాష్‌బోర్డ్ ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ను 74,34,732 మంది లబ్ధిదారులకు వేశారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 34,83,685 మందికి రెండు డోసుల టీకాను వేశారు. ఇదిలాఉంటే.. దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 97,79,47,783 డోసులను లబ్దిదారులకు అందించారు.
Also Read: