PM Modi:ఉగ్రవాదులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు.. తాలిబన్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

PM Modi:ఉగ్రవాదులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు.. తాలిబన్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!
Pm Modi

తీవ్రవాద భావజాలంతో ఎక్కువ కాలం పాలన సాగించలేరని భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయంలో వివిధ అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు.

Balaraju Goud

|

Aug 20, 2021 | 4:22 PM

PM Modi Inaugurate Somnath Temple: తీవ్రవాద భావజాలంతో ఎక్కువ కాలం పాలన సాగించలేరని భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక శక్తులు, తీవ్రవాదులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాలను పరిపాలించే వారి ఆధిపత్యాన్ని కొంతకాలానికి మాత్రమే పరిమితమని అన్నారు. అయితే, ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మళ్లీ అరాచకం మొదలు పెట్టారని వస్తోన్న వార్తల నేపథ్యంలో విధ్వంసక శక్తులపై ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాంటివారు మానవజాతిని ఎన్నటికీ అణచివేయలేరని.. అందుకే వారి ఉనికి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ సందర్భంగా మాట్లాడుతూ… ‘సోమ్‌నాథ్‌ ఆలయం ఎన్నోసార్లు విధ్వంసానికి గురయ్యింది. విగ్రహాలను కూడా చాలా సార్లు అపవిత్రం చేశారు. ఆలయ ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇలా దాడులు జరిగిన ప్రతిసారీ సోమ్‌నాథ్‌ ఆలయం మరింత వైభవాన్ని సాధించింది. ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోంది’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గతంలో సోమ్‌నాథ్‌ ఆలయం ధ్వంసం చేసిన విషయం వాస్తవమని.. ప్రస్తుతం కూడా ఇదే విధంగా జరుగుతుండడం కూడా నిజమని అన్నారు. ఇక 2013లో ప్రపంచ పర్యాటకంలో 65 స్థానంలో ఉన్న భారత్‌.. 2019 నాటికి 34వ స్థానానికి చేరుకున్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

ఇదిలాఉంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు ప్రజాస్వామ్యాన్ని కూలదోసి రాజ్యాధికారాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోన్న వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. అంతేకాకుండా మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చి.. వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నారనే నివేదికలు వస్తున్నాయి. ఇలా అఫ్గాన్‌ ప్రజలపై తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలైనట్లు వస్తోన్న వార్తలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ అఫ్గాన్‌లో ఆకలి కేకలు తప్పవని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

ఈ సందర్భంగా కనీసం కోటి మందికిపైగా ఆకలి బాధను ఎదుర్కొంటారని అంచనావేసింది.. సోమ్ నాథ్ రిసార్ట్, ప్రదర్శనశాలను మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీ.. పార్వతీ ఆలయానికి కూడా శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ.47 కోట్లతో ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. పురాతన సోమ్ నాథ్ కట్టడాలకు ఆధునిక హంగులను అద్దుతూ ప్రదర్శనశాలను సుందరంగా తయారు చేశారు. సోమ్ నాథ్ రినోవేటెడ్ టెంపుల్ కాంప్లెక్స్ ఓల్డ్ (జునా)ను శ్రీ సోమ్ నాథ్ ట్రస్ట్ రూ.3.5 కోట్లతో పూర్తి చేసింది. దీనిని అలీభాయ్ మందిరంగా పిలుస్తారు. రాణి అలీభాయ్ నిర్మించిన కారణంగా ఈ పేరు వచ్చింది. పాత ఆలయం పూర్తిగా శిథిలమవడం వల్ల ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. శ్రీ పార్వతి ఆలయాన్ని రూ.30 కోట్లతో నిర్మించారు. ఇందులోనే ఆలయ నిర్మాణం, నాట్య మండపాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా పలువురు పాల్గొననున్నారు.

Read Also…. Google Pixel 5a 5g: మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన గూగుల్‌.. దుమ్ము, నీటిని తట్టుకునే శక్తి ఈ ఫోన్‌ సొంతం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu