AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సైనికుల కోసం ప్రోటోకాల్‌ పక్కనబెట్టిన ప్రధాని.. హంగు ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా మారిన మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఎదో ఒక ప్రత్యేక చాటుకుంటూ ఉంటారు. విభిన్న వస్త్ర అలంకరణ, భిన్నమైన పనులతో ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా మరోసారి హాట్ టాఫిక్‌గా మారారు

PM Modi: సైనికుల కోసం ప్రోటోకాల్‌ పక్కనబెట్టిన ప్రధాని.. హంగు ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా మారిన మోడీ..
Pm Modi Nowshera
Balaraju Goud
|

Updated on: Nov 04, 2021 | 12:16 PM

Share

PM Modi Arrives Nowshera: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఎదో ఒక ప్రత్యేక చాటుకుంటూ ఉంటారు. విభిన్న వస్త్ర అలంకరణ, భిన్నమైన పనులతో ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా మరోసారి హాట్ టాఫిక్‌గా మారారు. ప్రధానమంత్రి వెళ్తున్నారంటే ఎలా ఉంటుంది.. రాజు వెడలె.. అన్నట్టు ఆ హంగూ ఆర్భాటం వేరే ఉంటాయి. ముందు కార్లు.. వెనుక కార్లు.. ఆ కాన్వాయ్‌ ప్రయాణం కథే వేరుగా ఉంటుంది. కానీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంథింగ్ స్పెషల్‌గా రోడ్డెక్కారు. అవను, సామాన్యుడిలా కారు తీశారాయన. ప్రోటోకాల్‌కు కాస్త విరామం ఇచ్చారు.

రోడ్డెక్కిన ప్రధాని రయ్ మంటూ దూసుకెళ్లారు.. మోడీ వెళ్తున్న రూట్‌లో రెడ్‌ సిగ్నల్‌ పడింది. మామూలుగా అయితే ప్రధాని మార్గంలో ట్రాఫిక్ క్లియర్‌ చేసి ఉంటారు. ఇవాళ మోడీ సామాన్యుడిలా వెళ్తుండడంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. అందరిలా గ్రీన్‌ సిగ్నల్‌ పడే వరకు ఆగి.. తర్వాతే వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సైనికులతో కలిసి దీపావళి పండుగ సంబరాలు చేసుకుంటుంటారు ప్రధాని మోడీ. కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో పండుగ చేసుకునేందుకు ఇలా సామాన్యుడిలా వెళ్లారాయన. కానీ.. ఎంతైనా ప్రధానమంత్రి ప్రధానమంత్రే కదా. భద్రతా విభాగం మోడీకి మినిమం సెక్యూరిటీ ప్రొవైడ్‌ చేసింది.

మొదట నౌషెరా సెక్టార్‌లో ఉన్న సైనికుల అమరవీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు. ఆ తర్వాత సైనికులను ప్రశంసలతో ముంచెత్తారు. బోర్డర్‌లో సాహసంతో దేశం కోసం పహారా కాస్తున్న సైనికులను అభినందించారు. తాను ప్రధానిగా ఇక్కడికి రాలేదని, కుటుంబ సభ్యుడిగా వచ్చానన్నారు మోదీ. సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని. సైన్యం సేవలు చూసి, దేశం గర్విస్తోందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సైనికులు సాహసంతో ముందుడుగు వేస్తున్నారని కొనియాడారు.

జమ్మూకశ్మీరులోని రాజౌరీ జిల్లా నౌషెరా ఆర్మీ క్యాంపులో గురువారం ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ చేరుకుని.. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు వచ్చారు. జమ్మూలో ఆర్మీ ఉన్నతాధికారులు, ఇతర జవాన్లను ప్రధాని మోడీ కలుకున్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన నరేంద్రమోడీ నాటి నుంచి ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకుంటూ వస్తున్నారు.

అంతకుముందు ఆయన ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ 2019లో కూడా రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ప్రధాని మోడీ పర్యటనకు ముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఈ ప్రాంతాలపై వైమానిక నిఘా పెట్టారు. జమ్మూ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితుల గురించి ప్రధానికి ఆర్మీ చీఫ్ జనరల్ వివరించారు.

Pm Modi At Nowshera

PM Modi At Nowshera

Read Also…. UPSC: గాయపడినప్పుడు మనుషుల్లా ఏడ్చే జంతువు ఏంటో తెలుసా? యూపీఎస్‌సీలో అడిగే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు..