AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC: గాయపడినప్పుడు మనుషుల్లా ఏడ్చే జంతువు ఏంటో తెలుసా? యూపీఎస్‌సీలో అడిగే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు..

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించుకోవాల‌నేది ప్ర‌తీ ఒక్కరి క‌ల‌. ఇందుకోస‌మే ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇంజ‌నీరింగ్ వంటి టెక్నిక‌ల్ డిగ్రీలు చేసిన వారు కూడా...

UPSC: గాయపడినప్పుడు మనుషుల్లా ఏడ్చే జంతువు ఏంటో తెలుసా? యూపీఎస్‌సీలో అడిగే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు..
Upsc Questions
Narender Vaitla
|

Updated on: Nov 04, 2021 | 11:50 AM

Share

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించుకోవాల‌నేది ప్ర‌తీ ఒక్కరి క‌ల‌. ఇందుకోస‌మే ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇంజ‌నీరింగ్ వంటి టెక్నిక‌ల్ డిగ్రీలు చేసిన వారు కూడా యూపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రువుతుంటారు. ఇక దేశంలో అత్యంత క్లిష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో ఒక‌టిగా యూపీఎస్‌సీకి పేరుంది. ముఖ్యంగా రాత ప‌రీక్ష త‌ర్వాత ఉండే ఇంట‌ర్వ్యూపై అంద‌రి దృష్టి ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్‌సీ ప‌రీక్ష ప్ర‌క్రియ‌లో అత్యం క్లిష్ట‌మైన ఘట్టం ఇదే. చాలా మంది ఇంట‌ర్వ్యూలో నిరాశ‌తో ఎదురు తిరుగుతుంటారు.

ఇదిలా ఉంటే యూపీఎస్‌సీ ఇంట‌ర్వ్యూలో అడిగే ప్ర‌శ్న‌లు కూడా విచిత్రంగా ఉంటాయి. ప్ర‌శ్న‌, జ‌వాబుల్లా కాకుండా అభ్య‌ర్థి మాన‌సిక స్థితిని అంచ‌నా వేయ‌డానికి ఉద్దేశించిన‌ట్లు ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఈ నేప‌థ్యంలో యూపీఎస్‌సీలో అడిగే కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు, వాటి స‌మాధానాలు ఇప్పుడు చూద్దాం..

ప్రశ్న: భూకంపం తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సమాధానం: భూకంప తీవ్ర‌త‌ను రిక్టర్ మాగ్నిట్యూడ్ స్కేల్ అనే ప‌రిక‌రంతో కొలుస్తారు.

ప్రశ్న‌: రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు త‌గ్గించారు? సమాధానం: 61వ సవరణ.

ప్రశ్న‌: ఏ సాధువు తన సందేశాలను ప్రచారం చేయడానికి హిందీని మొదట ఉపయోగించాడు? సమాధానం: రామానంద్.

ప్రశ్న: రోబోటిక్స్ భవిష్యత్తు ఏంటి? మనుషుల స్థానంలో రోబోలు వచ్చే సమయం వస్తుందా? సమాధానం: ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేటప్పుడు, ఒక అభ్యర్థి రోబోటిక్స్, ఆలోచనలు మనిషి నుంచి భావోద్వేగాలను వేరు చేస్తున్నాయని చెప్పారు.

ప్రశ్న: గాయపడినప్పుడు మనుషులలాగా ఏడ్చే జంతువు ఏది? సమాధానం: ఎలుగుబంటి.

ప్రశ్న: న్యాయవాదులు నల్లకోటు మాత్రమే ఎందుకు ధరిస్తారు? సమాధానం: నల్ల కోటు క్రమశిక్షణ, విశ్వాసాన్ని చూపుతుంది.

ప్రశ్న: ప్రపంచంలో సింథటిక్ రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: అమెరికా.

ప్రశ్న: భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు? సమాధానం: ఇందిరా గాంధీ.

ప్రశ్: భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో ఉర్దూకు రెండవ భాష హోదా ఇచ్చారు.? సమాధానం: బిహార్‌, ఉత్తరప్రదేశ్.

Also Read: Peddanna Twitter Review: పెద్దన్న ట్విట్టర్ రివ్యూ.. రజినీకాంత్ సినిమా పై ఆడియన్స్ ఓపెనియన్..

Anupam Kher: నువ్వేం బాగోలేవు.. ఎండిపోయిన చేపలా తయారయ్యావ్‌.. అనుపమ్‌పై తల్లి తిట్ల దండకం..

Crime News: స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు.. అంతలోనే విషాదం.. స్పాట్‌లో యువకుడి దుర్మరణం!