Crime News: స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు.. అంతలోనే విషాదం.. స్పాట్‌లో యువకుడి దుర్మరణం!

స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు. సంతోషంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. అంతలోనే ఏమైందో తెలియదు. ఎయిర్ గన్‌ మిస్‌ ఫైర్ అయ్యింది.

Crime News: స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు.. అంతలోనే విషాదం.. స్పాట్‌లో యువకుడి దుర్మరణం!
Air Gun Misfire
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 04, 2021 | 9:45 AM

Air Gun Misfire: స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు. సంతోషంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. అంతలోనే ఏమైందో తెలియదు. ఎయిర్ గన్‌ మిస్‌ ఫైర్ అయ్యింది. అంతే, అప్పటివరకు స్నేహితుల ముచ్చట్లతో కళకళలాడిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. గన్ మిస్‌ ఫైర్ అవడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్ గ్రామానికి చెందిన ఫజల్‌.. ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌ నుంచి 8మంది స్నేహితుల్ని పిలిచాడు. రాత్రంతా విందు చేసుకున్నారు. ఆడిపాడుకున్నారు. ఎయిర్‌ గన్‌తో హంగామా చేశారు. అది కాస్తా శృతిమించి ఎయిర్‌గన్ మిస్‌ ఫైరైంది. విందు చేసుకొనే క్రమంలో షికారుకు చెందిన గన్‌తో ఫైర్ చేయడంతో అది మిస ఫైర్ అయి ముసాఫ్(20) తలకు బలంగా తగిలింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడు ముసాఫ్‌ ఖాన్‌ను వెంటనే సలాక్‌పూర్ నుండి సిద్దిపేటకు ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే ముసాఫ్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read Also…  Andhra Pradesh: అయ్యో పాపం యాక్సిడెంట్ అనుకోకండి.. అస‌లు విష‌యం తెలిస్తే మైండ్ బ్లాంక్