Anupam Kher: నువ్వేం బాగోలేవు.. ఎండిపోయిన చేపలా తయారయ్యావ్‌.. అనుపమ్‌పై తల్లి తిట్ల దండకం..

పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు మాత్రం వారిని ఇంకా చిన్న పిల్లల్లాగే చూస్తుంటారు. బిడ్డలు ఎక్కడున్నా నిత్యం వారి బాగోగుల గురించే ఆలోచిస్తుంటారు..

Anupam Kher: నువ్వేం బాగోలేవు.. ఎండిపోయిన చేపలా తయారయ్యావ్‌.. అనుపమ్‌పై తల్లి తిట్ల దండకం..
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2021 | 10:32 AM

పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు మాత్రం వారిని ఇంకా చిన్న పిల్లల్లాగే చూస్తుంటారు. బిడ్డలు ఎక్కడున్నా నిత్యం వారి బాగోగుల గురించే ఆలోచిస్తుంటారు. ఆరోగ్యం బాగా లేకపోయినా, కాస్త బరువు తగ్గినా తెగ ఆందోళన పడిపోతుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన తల్లిని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో అనుపమ్‌ తల్లి దులారీ ఖేర్‌ తన కుమారుడిని చూస్తూ ‘ నువ్వు సన్నగా ఉన్నావు. నువ్వేం బాగోలేవు. బాగా బక్కచిక్కిపోయి ఎండిపోయిన చేపలా తయారయ్యావ్‌’ అని తిడుతుంది. ఈ తిట్లను భరించలేని అనుపమ్ తాను బాగానే తింటున్నానంటూ తాను తింటోన్న పరాటాను తల్లికి చూపిస్తాడు. అయినా ఆమె తిట్ల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. ఈ సమయంలో ఆమె చూపించిన హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

నెల తర్వాత కలుసుకున్నాను..అందుకే ఇలా.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అనుపమ్‌ ‘ సుమారు నెల తర్వాత మా అమ్మను కలుసుకున్నాను. అందుకే ఇలా నన్ను తిడుతోంది. అమ్మ తిడితే తిట్టింది కానీ నాకోసం రెండు మంచి చొక్కాలు తీసుకొచ్చింది. పైగా నేను స్వయంగా చేసిన పరోటాను కూడా మెచ్చుకుంది. మా అమ్మ నిస్తేజంగా ఉండడం నాకు నచ్చదు. ఆమె లాగే అందరూ ఎప్పుడూ ఉత్సాహంగా, సందడిగా ఉండాలి’ అని రాసుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

Also Read:

Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..

Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..