AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. భారీగా తరలివస్తున్న బౌద్ధ బిక్షువుల

ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ యాత్రా స్థలాలను అనుసంధానించే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 

PM Modi: అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. భారీగా తరలివస్తున్న బౌద్ధ బిక్షువుల
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2021 | 6:57 AM

ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ యాత్రా స్థలాలను అనుసంధానించే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆయన తన పర్యటనలో ఉత్తర ప్రదేశ్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుషినగర్ మహాపరినిర్వణ దేవాలయంలో ‘అభిధమ్మ దినోత్సవం’ రోజున నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొంటారని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) తెలిపింది. దీని తరువాత ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

కుశీనగర్ అనేది అంతర్జాతీయ బౌద్ధ తీర్థయాత్ర ప్రదేశం ఇక్కడ గౌతమ బుద్ధుని మహాపరిణిణ జరిగింది. కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీలంకలోని కొలంబో నుండి 100 మంది బౌద్ధ సన్యాసులు ప్రముఖులతో శ్రీలంక ప్రతినిధి బృందం అక్కడికి చేరుకుంటుంది. దీనిలో 12 మంది సభ్యుల పవిత్ర అవశేష బృందం ప్రదర్శన కోసం బుద్ధ భగవానుని శేషాలను తెస్తుంది.

ఈ ప్రతినిధి బృందంలో శ్రీలంకలోని బౌద్ధమతం అన్ని నాలుగు నికట్స్, అస్గిరియా, అమరపుర, రమణ్య , మాలవట్టల అనునాయకులు (డిప్యూటీ హెడ్స్) కూడా ఉంటారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. దీనితో పాటు, కేబినెట్ మంత్రి నామల్ రాజపక్సే నాయకత్వంలో శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఐదుగురు మంత్రులు కూడా ఇందులో భాగం కానున్నారు.

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం

ఈ విమానాశ్రయం రూ .260 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిందని కార్యాలయం తెలిపింది. ఇది దేశీయ, అంతర్జాతీయ యాత్రికులు బుద్ధ భగవానుని మహాపరినిర్వణ స్థలాన్ని సందర్శించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రపంచాన్ని ఈ బౌద్ధ యాత్రా స్థలంతో అనుసంధానించే ప్రయత్నంలో భాగంగా ఈ విమానాశ్రయం నిర్మించబడింది. ఈ విమానాశ్రయం ప్రక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ , బీహార్ జిల్లాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలను పెంచడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.

ప్రధాని మోడీ తర్వాత ట్వీట్ చేస్తూ, “మన మౌలిక సదుపాయాలు, పౌర విమానయాన రంగానికి ప్రత్యేక రోజు. కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించబడుతుంది. మొదటి విమానం శ్రీలంకలోని కొలంబో నుండి వస్తుంది. దాని ప్రయాణీకులలో బౌద్ధ సన్యాసుల బృందం ఉంటుంది.

బుద్ధ భగవానుడి విగ్రహం ఉన్న మహాపరిణి ఆలయంలో ప్రధాని మోడీ బోధి వృక్షాన్ని నాటనున్నారు. ‘అభిధమ్మ’ రోజున నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.  ఆ సమయంలో బౌద్ధ సన్యాసులు మఠంలో ఒకే చోట ఉండి ప్రార్థనలు చేస్తారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్ , కంబోడియా నుండి ప్రముఖ బౌద్ధ బిక్షువుల.. వివిధ దేశాల రాయబారులు హాజరవుతారు.

ఇవి కూడా చదవండి: AP Bandh: నేడు ఏపీలో బంద్‌.. టీడీపీ నేతల ఆందోళన.. ముందస్తు అరెస్టులు.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బలగాలు

CM KCR Yadadri: యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎప్పుడంటే..