CM KCR Yadadri: యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎప్పుడంటే..
Yadadri Temple: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న కేసీఆర్ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు
Yadadri Temple: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న కేసీఆర్ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయం, క్యూలైన్లు, శివాలయం, పుష్కరిణిని సందర్శించారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నాయకులను వేద పండితులు ఆశీర్వదించారు. ఇక ఆలయ పునః ప్రారంభానికి శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి ఖరారు చేశారు. స్పదస్పూర్తితో ఈ ముహూర్త పత్రికను రాశారు. ముహూర్త పత్రికను కేసీఆర్ స్వామి వారి పాదాల చెంత ఉంచారు.
అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. ఆలయ పునః ప్రారంభ తేదీని ప్రకటించారు కేసీఆర్. 2022 మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినట్లు వెల్లడించారు. 8 రోజుల ముందు నుంచి మహా సుదర్శన యాగం జరుగుతుందని అన్నారు. అలాగే చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో మహా సుదర్శన యాగం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. యాదాద్రిలో 10వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. శిల్పరామం హైదరాబాద్ ల్యాండ్‌మార్క్.. చిన జీయర్ స్వామి సూచనల మేరకు ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం పునర్నిర్మాణం జరిగిందన్నారు. ఆధ్యాత్మిక విషయాలలో తెలంగాణ నిరాదరణుక గురైందని అన్నారు. పుష్కరాలు నిర్వహించేవారు కూడా కాదు.. ఉద్యమ సమయంలో నేను ప్రశ్నిస్తే పుష్కర ఘాట్లు నిర్మించారని అన్నారు. తెలంగాణకు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. 50 ఏళ్ల కిందట యాదిద్రికి వచ్చాను. సమైక్య పాలనలో చాలా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. తెలంగాణ సామాజిక వివక్షే కాదు.. ఆధ్యాత్మిక వివక్ష కూడా కొనసాగిందన్నారు. యాదాద్రిలో నృసింహ సాగర్ కూడా పూర్తి కావచ్చిందని, ప్రతినిత్యం స్వామివారికి ఆ జలాలతో అభిషేకం నిర్వహించవచ్చన్నారు.
250 ఎకరాల్లో అన్ని రకాల సౌకర్యాలతో కాటేజీలు..
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించింది. 12 భాగాలుగా అంచెల వారీగా నిర్మాణం కొనసాగుతుంది. భక్తులకు సకల సదుపాయాలు కల్పించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి నిర్మాణం చేపట్టింది తెలంగాణ సర్కారు. మొత్తం ప్రాజెక్టు సుమారు వెయ్యి ఎకరాల్లో రూపొందుతోంది. టెంపుల్ సిటీలోని 850 ఎకరాలలో.. మొదటి దశలో 250 ఎకరాల్లో అన్ని రకాల సౌకర్యాలతో కాటేజీలు, ఉద్యానవనాలు, రోడ్లు రాబోతున్నాయి.
గుట్టదిగువన 14 ఎకరాల కొండను కొనుగోలు..
గుట్ట దిగువన 14 ఎకరాల కొండను కొనుగోలు చేసి ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాతల విరాళాలతో వీవీఐపీల విడిది కోసం 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్సియల్ సూట్ నిర్మిస్తున్నారు. యాత్రీకుల బస కోసం కొండ కిందే వసతుల ఏర్పాటు చేస్తు్న్నారు. పెద్దగుట్టపై 850 ఎకరాలు కొనుగోలు చేశారు. తొలి ధపాలో 250 ఎకరాలలో లే అవుట్ పనులు చేపట్టారు.
ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారం..
ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం జరుగుతుందని, ఇందుకు 125 కిలోల బంగారం అవసరం అవుతుందని అన్నారు. ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తామని అన్నారు. మా కుటుంబం నుంచి కిలో 16 తులాలు సమకూరుస్తాము అని అన్నారు. అలాగే1008 కుండలాలతో మహా సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందని, సుమారు 6 వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు.