Hyderabad: అయ్యయ్యో వద్దమ్మా.. అందుకే కొట్టారా..? తనపై ఎవరు దాడి చేశారో చెప్పిన డాన్సర్ శరత్
ఇటీవల సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో ఎవ్వరు చెప్పలేం.. సరదాగా చేసిన చిన్న వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసే రేంజ్ లో పాపులర్ అవుతూ ఉంటాయి.
Hyderabad: ఇటీవల సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో ఎవ్వరు చెప్పలేం.. సరదాగా చేసిన చిన్న వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసే రేంజ్ లో పాపులర్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో అయ్యయ్యో వద్దమ్మా అంటూ.. వీడియో ఓ కుర్రాడు చేసిన వీడియో తెగ చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ను ఉపయోగించుకొని చాలా మంది దీనిపై వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే ఓ టీ యాడ్ ను ఇలా తన స్టైల్ లో చెప్పి పాపులర్ అయ్యాడు. యాడ్‌ను తనదైన శైలిలో తీన్మార్ స్టెప్పులుగా తర్జుమా చేసి.. ఓవర్ నైట్‌లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన ‘డాన్సర్ శరత్’ పై దాడి జరిగింది. ఎవరూలేని సమయంలో దాదాపు 15 మంది తన పై దాడి చేశారని చెప్తున్నాడు శరత్. శరత్ ఒళ్లంతా గాయాలు, రక్తపు దారలతో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇంతకు తన పై దాడి చేసింది ఎవరు..? కొంతమంది హిజ్రాలను ఇమిటేట్ చేశాడు కాబట్టే అతడి పై వారు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అయితే తన పై దాడి చేసింది ఎవరో చెప్పాడు శరత్. గతంలో తనకు చెల్లి వరస అయ్యే ఓ యువతిని కొంతమంది ఏడిపించారని అప్పుడు వాళ్ళ పై దాడి చేశాం అని చెప్పాడు శరత్.. అలా దాడి చేయడంతో తమను పోలీసులు అరెస్ట్ కూడా చేశారని చెప్పుకొచ్చాడు శరత్. ఇటీవలే బెయిల్ పైన తాను బయటకు వచ్చానని..పాత పగలే మనసులో పెట్టుకొని తన పై దాడి చేశారని అంటున్నాడు శరత్. అంతే కాకుండా తాను ఇలా పాపులర్ అవ్వడం తట్టుకోలేక దాడి చేశారని అంటున్నాడు శరత్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..
Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..