Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. డ్యూటీకి వెళ్లొద్దన్నందుకు ఓ మహిళ ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

Hyderabad Crime: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంగా ఉన్న కూతురుని ఉద్యోగానికి వెళ్లవద్దని తండ్రి మందలించటంతో..

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. డ్యూటీకి వెళ్లొద్దన్నందుకు ఓ మహిళ ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..
Died
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 20, 2021 | 6:01 AM

Hyderabad Crime: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంగా ఉన్న కూతురుని ఉద్యోగానికి వెళ్లవద్దని తండ్రి మందలించటంతో.. కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మమత అనే వివాహిత నిజాంపేటలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. 2019లో ఆమెకు వివాహం అవగా.. భర్తకు క్యాన్సర్ ఉందని తెలియటంతో పెళ్లైన రెండు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తోంది. నిజాంపేటలోని ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తోంది.

అయితే, మంగళవారం నాడు మమత ఆరోగ్యం సరిగా లేదు. దాంతో ఉద్యోగానికి వెళ్లనవసరం లేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని మమతను ఆమె తండ్రి ఎల్లయ్య మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకెళ్లిన ఎల్లయ్య.. తిరిగి ఇంటికొచ్చి చూడగా మమత విగత జీవిగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దింపగా అప్పటికే ప్రాణాలు విడిచింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మమత మృతికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!

Andhra Pradesh: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి..

Huzurabad Bypoll: దళిత బంధు నిలిపివేత.. బీజేపీపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు..

పవన్ కూతురు ఆద్య చేసిన మంచి పనికి చప్పట్లు కొట్టాల్సిందే.. వీడియో
పవన్ కూతురు ఆద్య చేసిన మంచి పనికి చప్పట్లు కొట్టాల్సిందే.. వీడియో
జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
APPSC జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసిందోచ్..
APPSC జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసిందోచ్..
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!