Huzurabad Bypoll: దళిత బంధు నిలిపివేత.. బీజేపీపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు..

Huzurabad Bypoll: దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంపై టీఆర్ఎస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు ఆగిపోవడానికి..

Huzurabad Bypoll: దళిత బంధు నిలిపివేత.. బీజేపీపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు..
Koppula Eswar
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 20, 2021 | 5:56 AM

Huzurabad Bypoll: దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంపై టీఆర్ఎస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం లేదన్నారు. ఇదే అంశంపై మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దళిత బందు పథకంపై అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇటువంటి నిర్ణయం చాలా బాధాకరం అన్నారు. దళిత బందు పథకం ఆపడం ఒక రాజకీయ నిర్ణయం అని భావిస్తున్నామని పేర్కొన్నారు. దళిత బందు పథకం ఆపడంలో కుట్ర కనబడుతుందన్నారు. ఈ పథకం శాసన సభ క్యాబినెట్ ఆమోదం తీసుకొని దళితుల అకౌంట్లలో డబ్బులు వచ్చిన తరువాత అగిందంటే ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, గోనె ప్రకాష్ రావు, పద్మనాభ రెడ్డి లేఖలు రాసి ‘దళిత బందు’ పథకాన్ని నిలిపివేశారని ఆరోపించారు. దళిత సమాజానికి జరిగిన ద్రోహంగా భావించి దళితులందరూ ఒక తాటి పైకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బీజేపీ కి చెందిన ప్రేమెందర్ రెడ్డి లేఖ ఆధారంగానే ‘దళిత బందు’ ఆగిందన్నారు. బీజేపీ వాళ్ళే ఫిర్యాదు చేసి.. ఆపై సీఎం కేసీఅర్‌ను రాజీనామ చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళిత సమాజానికి ద్రోహం చేసిన పార్టీ బీజేపీని.. దళితులంతా ఏకమై నిలదీయాలని పిలుపునిచ్చారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

దళిత వ్యతిరేకి బీజేపీ.. బీజేపీ అంటేనే దళిత సమాజానికి వ్యతిరేకం అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయడం, ఆ వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆపడం జరిగిందన్నారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నపుడే రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు కు ఆమోదం ఇచ్చిందని సుమన్ గుర్తు చేశారు. దళితులందరూ టీఆరెఎస్ వైపే ఉన్నారనే అక్కసుతో దళిత బందు పై ఫిర్యాదు చేసి అపించారని ఆరోపించారు. తెలంగాణ దళిత జాతిలో బీజేపీ ద్రోహి గా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. దళిత జాతి మిమ్మల్ని క్షమించదని, రేపటి నుండి దళిత వాడల్లో బీజేపీ ఎలా వస్తుందో చూస్తామంటూ బాల్క సుమన్ హెచ్చరించారు. దళితబంధు నిలిచిపోవడానికి కేసీఅర్ కాదు.. బీజేపీనే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి తెలంగాణలో దళితుల ఓట్లు ఎలా వస్తాయో చూస్తామన్నారు. చదువు రాని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. చట్టాలు ఎలా చేస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. బీజేపీ దళితులకు చేసిన ద్రోహానికి.. ఓటు రూపంలో దళితులు ఆ పార్టీకి బుద్ది చెప్తారు. ఓ వైపు దళితుల భూములు గుంజుకున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు దళిత బంధును నిలిపివేయించారని ఆరోపించారు. రేపటి నుండి దళితులందరూ ఏకమై బీజేపీ నాయకులను నిలదీయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. పన్నెండు రోజులు మాత్రమే ఆపుతారని, అంతకు మించి మీరు ఆపలేరని బీజేపీ నేతలుద్దేశించి వ్యాఖ్యానించారు. 12 రోజుల తరువాత అన్ని దళిత కుటుంబాల ఖాతాల్లో డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు.

Also read:

Andhra Pradesh: జగనన్న తోడు పథకం.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్న సీఎం జగన్..

Telugu Desam Party: సొంత పార్టీ నేతల ఝలక్ ఇస్తున్న చంద్రబాబు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

YCP vs TDP Clashes: నోటికొచ్చినట్లు తిడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..