Telugu Desam Party: సొంత పార్టీ నేతల ఝలక్ ఇస్తున్న చంద్రబాబు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Telugu Desam Party: నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఝలక్ ఇస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ సంస్థాగత నిర్మాణం,
Telugu Desam Party: నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఝలక్ ఇస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లను నియమిస్తున్నారు. దాదాపుగా ఇన్‌ఛార్జ్ లకే టికెట్స్ అనే సంకేతం ఇస్తున్నారు. దీంతో నేతలు ఇన్ చార్జ్ పదవి కోసం.. విన్నవించుకుంటున్నారు. అయితే, ఆ విన్నపాలను చంద్రబాబు ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.
గత కొద్దిరోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సంస్థాగత నిర్మాణం.. బలోపేతం పై దృష్టి పెట్టారు.. అందులో భాగంగా రాష్ట్ర, పోలిట్ బ్యూరో కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను నియమిస్తున్నారు.. ఇందులో లోతైన కసరత్తు చేస్తున్న చంద్రబాబు నేతలు వినతులకు పరిగణనలోకి తీసుకోకుండా పనితీరు, సామర్థ్యం ఆధారంగా పదవులు ఇస్తున్నారు..
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నేతలెవరూ పార్టీలో లేరు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. మంత్రిగా పనిచేసిన జవహర్‌కు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి వర్గం గొడవ చేసింది. జవహర్ కి కాకుండా ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు వ్యతిరేక వర్గం. దాంతో అనిత కు కొవ్వూరు, కృష్ణా జిల్లా తిరువూరులో జవహర్ కి టికెట్స్ ఇచ్చింది అధిష్టానం. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనిత కు పాయకరావుపేట ఇన్‌ఛార్జ్ గా తిరిగి బాధ్యతలు ఇచ్చారు. జవహర్ ని రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడుగా నియమించారు చంద్రబాబు. అప్పటినుంచి కొవ్వూరు ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్న జవహర్‌కు అధిష్టానం తాజాగా ఝలక్ ఇచ్చింది.
నియోజకవర్గంలో అసమ్మతి, వర్గపోరు కారణంగా ఇన్‌ఛార్జ్ ను నియమించకుండా.. టూ మెన్ కమిటీ నియమించారు చంద్రబాబు. కంఠమనేని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి లను టూ మెన్ కమిటీగా నియమించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు, నేతల సమన్వయం వీళ్లు చూస్తారు. దీంతో ఇంతకాలం ఇన్‌ఛార్జ్ పదవి పై ఆశలు పెట్టుకున్న జవహర్‌కు నిరాశే మిగిలింది. తన స్వంత నియోజకవర్గం కృష్ణా జిల్లా తిరువూరులో గత ఎన్నికల్లో పోటీ చేసిన జవహర్ కు.. తిరువూరులో కూడా ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వలేదు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ పదవి ఆశించిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కి ఇవ్వకుండా.. దేవ దత్‌కు తిరువూరు ఇన్‌ఛార్జ్ పదవి కేటాయించారు చంద్రబాబు.
గతంలో వ్యవహరించిన విధంగా కాకుండా.. పదవుల కేటాయింపులో చంద్రబాబు గట్టిగానే ఉన్నారని, ఎలాంటి సిపార్సులు, వినతులు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. అన్ని సమీకరణలు, పని తీరు ఆధారంగానే పదవులు కేటాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
Also read: