YCP vs TDP Clashes: నోటికొచ్చినట్లు తిడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..
YCP vs TDP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా టీడీపీ నేతలు చేస్తున్న పరుషమైన కామెంట్స్‌పై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
YCP vs TDP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా టీడీపీ నేతలు చేస్తున్న పరుషమైన కామెంట్స్‌పై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. టిడిపి బ్లడ్ ప్రవాహి౦చేవారు తప్ప.. సామాన్యులెవరూ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలను సమర్థించేవారు౦డరని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ కాలిగోటికి కూడా సరిపోని చంద్రబాబునాయుడు.. తన తొత్తులతో తిట్టిస్తే ఊరుకునే వైసీపీ కార్యకర్తలెవరూ ఇక్కడ లేరన్నారు. చంద్రబాబు కావాలనే మాట్లాడి౦చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోగొట్టాలనేది చంద్రబాబు తాపత్రయంగా కనిపిస్తోందన్నారు. మళ్లీ ఇలాంటి మాటలు రిపీట్ అయితే మాట్లాడే వ్యక్తి ఇంటిపైకి కాదు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి దాడి చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే అమర్నాథ్. ‘‘మరి చంద్రబాబు కొడుకు అడ్డువ స్తాడో.. బోసిడికే గ్యాంగ్ అడ్డొస్తుందో చూస్తాం..’’ అంటూ సీరియస్ అయ్యారు.
రాజకీయ ఉగ్రవాది చంద్రబాబు అంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. చంద్రబాబు లాంటి చీడ పురుగులు సమాజంలో రాజకీయం కోసం ఏదైనా చేస్తారని, ఎంతకైనా తెగిస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు మూతపడటం తప్ప.. ఏ షాపులు మూత పడవని అన్నారు. మీ పెంపుడు కుక్కలు నోటికొచ్చినట్లు మాట్లాడితే.. దానికి రాష్ట్ర ప్రజలు కలిసి రావాలా? అని ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అనకాపల్లిలో నారా లోకేష్ ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య మార్కెట్‌లో డ్రగ్స్‌కి అడిక్ట్ అయినవాళ్లే లావు తగ్గారని, నారా లోకేష్ కూడా అలాగే బరువు తగ్గాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు కంటే ముందుగానే పవన్ కళ్యాణ్‌కు బాధ కలిగిందన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్రీలాన్స్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఎవరు డబ్బులిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి వాలిపోతారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా పథకాలు అందిస్తున్నారని, దాన్ని డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Also read:
Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్..