AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Visit: మా పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు రండి.. ప్రధాని మోదీని ఆహ్వానించిన అమెరికన్‌ కాంగ్రెస్‌

అమెరికన్‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అమెరికా సెనేట్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించింది అమెరికా కాంగ్రెస్. ఈ నెల 22న ప్రధాని మోదీ అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండో సారి.

PM Modi US Visit: మా పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు రండి.. ప్రధాని మోదీని ఆహ్వానించిన అమెరికన్‌ కాంగ్రెస్‌
Prime Minister Modi
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2023 | 10:00 PM

Share

అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికన్‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అమెరికా సెనేట్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించడం తమకు గౌరవంగా భావిస్తున్నామని అమెరికా ఈ ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారిక పర్యటన కోసం ప్రధాని మోదీని అమెరికాకు ఆహ్వానించారు. దీనిపై దిగువ సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ, సేనేట్‌ తరఫు నేత చుక్‌ స్కుమెర్‌, సేనేట్‌ రిపబ్లికన్‌ నేత మిచ్‌ మెకోనెల్‌, హౌస్‌ డెమొక్రాటిక్‌ నేత హకీమ్‌ జఫ్రీస్‌ సంతకాలు చేశారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశాల్లో మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి.

రెండు దేశాల మధ్య భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ సమయంలో, భారత్ భవిష్యత్తు, రెండు దేశాలు ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్ల గురించి ప్రధాని మోదీ తన దృష్టికోణం సభ ముందు ఉంచన్నారు. అధికార పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఈ నెల 22న అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే.

అధ్యక్షుడు జో బిడెన్ ప్రధానికి ఆతిథ్యం..

మోదీ పర్యటన సందర్భంగా.. ప్రెసిడెంట్ జో బిడెన్ తన అధికారిక US పర్యటనలో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇందులో జూన్ 22 న స్టేట్ డిన్నర్ కూడా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌లు డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల గురించి ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలూ చర్చించనున్నారు. దీంతోపాటు వివిధ రంగాల్లో బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించడంపైనా సమీక్షించనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను అడ్డుకునేందుకు బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న విధివిధానాలకు మద్దతుగా ప్రధాని మోదీ తన పర్యటన కొనసాగనుంది.

అమెరికా పార్లమెంట్‌లో రెండోసారి

అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు 2016లో అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాకు వెళ్లడం ఇది ఆరోసారి. ఇటీవలే మే నెలలో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7, క్వాడ్ శిఖరాగ్ర సమావేశాల్లో కూడా ఇరువురు నేతలు సమావేశమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం