Maha Kumbh Fire Incident: అగ్ని ప్రమాదంపై యూపీ సీఎంకు ప్రధాని ఫోన్..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. సమీపంలోని 10 టెంట్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. మరోవైపు ప్రమాదంపై యూపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ అయ్యి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు దాటికి పలు గుడారాలు దగ్దమయ్యాయి. ఘటనా స్థలంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ టీం వెంటనే అలర్టయి.. మంటలను అదుపుచేశారు. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే సీఎం యోగి ఆతిథ్యనాథ్ స్పాట్‌కు వచ్చి.. ఘటనాస్థలిని పరీశిలించారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులను అడిగి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని పరిశీలించిన ఆదిత్యనాథ్, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి.
#UPCM @myogiadityanath ने आज जनपद प्रयागराज में महाकुम्भ मेला क्षेत्र में आगजनी की घटना को संज्ञान में लेकर स्थलीय निरीक्षण किया एवं स्थिति का जायजा लिया।
मुख्यमंत्री जी ने संबंधित अधिकारियों को राहत कार्य युद्धस्तर पर संचालित करने के निर्देश दिए। pic.twitter.com/tiaAFNRMwm
— CM Office, GoUP (@CMOfficeUP) January 19, 2025
ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని తెలుసుకుని అగ్నిప్రమాదంపై స్వయంగా సీఎం ఆదిత్యనాథ్‌తో ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాకు యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 18 నాటికి 77.2 మిలియన్లకు పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజే 46.95 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు.
సాధువుల శంఖనాదాలు, భజనలతో ప్రయాగ్ రాజ్ పులకించిపోతోంది. హర్ హర్ మహాదేవ్, జై శ్రీరాం, జై గంగామయ్యా నామస్మరణతో ప్రయాగ్ రాజ్ మార్మోగుతుంది. భక్తుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 వందల 96 ఛార్జీతో మహాకుంభ మేళా, ప్రయాగ్‌రాజ్ నగరాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం కల్పించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.