Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 74 ఏళ్లలోనూ సూపర్ ఫిట్.. సీక్రెట్ డైట్ ఏంటో తెలుసా..?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74 ఏళ్ల వయసులో కూడా తన శక్తి, మంచి ఆరోగ్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఆయన ఆరోగ్య రహస్యం, ఆయన గత 50 సంవత్సరాలుగా పాటిస్తున్న క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్ష అనే చెప్పాలి. ఇటీవల, ప్రధాని మోదీ అమెరికన్ పాడ్‌కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఉపవాస షెడ్యూల్, దాని ప్రభావాల గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు.

PM Modi: 74 ఏళ్లలోనూ సూపర్ ఫిట్.. సీక్రెట్ డైట్ ఏంటో తెలుసా..?
Pm Modi Fitness
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 20, 2025 | 3:45 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74 ఏళ్ల వయసులో కూడా తన శక్తి, మంచి ఆరోగ్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఆయన ఆరోగ్య రహస్యం, ఆయన గత 50 సంవత్సరాలుగా పాటిస్తున్న క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్ష అనే చెప్పాలి. ఇటీవల, ప్రధాని మోదీ అమెరికన్ పాడ్‌కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఉపవాస షెడ్యూల్, దాని ప్రభావాల గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు.

జూన్ మధ్య నుండి ప్రారంభమై దీపావళి వరకు కొనసాగే చాతుర్మాస ఉపవాసాన్ని భారతీయ సంప్రదాయం ప్రకారం తాను పాటిస్తానని ప్రధాని మోదీ అన్నారు. ఈ కాలంలో 24 గంటల్లో ఒకసారి మాత్రమే భోజనం చేస్తానన్నారు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ అభ్యాసం శరీరానికి మేలు చేస్తుందన్నారు.

ప్రధానమంత్రి మోదీ తన ఉపవాస సమయంలో అనుసరించిన కొన్ని కీలకమైన దినచర్యలను వెల్లడించారు. నవరాత్రి సమయంలో తాను తినడం పూర్తిగా మానేసి, వేడి నీళ్లు మాత్రమే తాగుతానని చెప్పారు. ఇది కాకుండా, చైత్ర నవరాత్రి సమయంలో ఒకే రకమైన పండ్లను మాత్రమే తింటారు. ఇందులో కూడా బొప్పాయిని మాత్రమే తీసుకుంటానని ప్రధాని మోదీ తెలిపారు. బొప్పాయి అనేక పోషకాలతో కూడిన పండు. దీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు నివారిస్తుంది. అనవసరపు వాపు తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్న వ్యక్తి దీన్ని ఖాళీ కడుపుతో తినాలి. ఇందులో ఉండే ఫైబర్, జీర్ణ ఎంజైమ్‌లు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.

ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, ఉపవాసం ఉన్నప్పుడు, వాసన, స్పర్శ, రుచి వంటి మీ ఇంద్రియాలు మరింత సున్నితంగా మారుతాయన్నారు. తనకు ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ క్రమశిక్షణ అని అన్నారు. ఇది మరింత దృఢంగా చేసే సాధనా విధానం. ఉపవాసం అనేది శారీరక ప్రక్రియ మాత్రమే కాదు, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను కూడా బలపరుస్తుందని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌