AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: జై విజ్ఞాన్, జై అనుసంధాన్.. ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం..

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకుని ఈరోజు నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలను కలసుకుని ఆయన అభినందనలు తెలియజేశారు. శనివారం ఉదయం పూటనే బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని ప్రజలను ఉద్దేశించి మట్లాడారు. ఈ ప్రసంగంలో ఆయన కీలక విషయాలు మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిచేందుకు నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగళూరుకు వచ్చానని తెలిపారు.

Chandrayaan-3: జై విజ్ఞాన్, జై అనుసంధాన్.. ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం..
Pm Modi
Aravind B
|

Updated on: Aug 26, 2023 | 8:58 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకుని ఈరోజు నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలను కలసుకుని ఆయన అభినందనలు తెలియజేశారు. శనివారం ఉదయం పూటనే బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని ప్రజలను ఉద్దేశించి మట్లాడారు. ఈ ప్రసంగంలో ఆయన కీలక విషయాలు మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిచేందుకు నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగళూరుకు వచ్చానని తెలిపారు. ఇస్రోకి చేరుకున్నాక శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది సరికొత్త భారతదేశానికి వేకువ అని కొనియాడారు. అలాగే జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ప్రజల్లో ఉత్సాహం నింపారు.

ఆ తర్వాత రోడ్‌షో నిర్వహించిన ప్రధాని మోదీ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ చేరుకున్నారు. అక్కడ శాస్త్రవేత్తలను అభినందించారు. ముందుగా చంద్రయాన్-3 బృందంతో కలిసి ఆయన ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రధాని మోదీకి చంద్రయాన్-3 ప్రయోగంలో వివిధ దశల గురించి వివరించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇస్రో సాధించినటువంటి ఈ విజయం చాలా గర్వకారణం. ఈరోజు భారత్ చందమామపై కాలు మోపింది. భారతదేశం ప్రపంచ దేశాలకు వెలుగులు విరజిమ్ముతుంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా. అయినా కూడా నా మనసంతా ఇక్కడే ఉంది. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. భారత్ సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి, వారి నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను. చంద్రయాన్-3 విజయం దేశ ప్రజల్లో చాలా సంతోషాన్ని నింపింది. ఇది మామూలు విజయం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రునిపై కూడా భారత జెండా రెపరెపలాడుతోంది. ఇస్రో సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణం. భారత్ శక్తి సామర్ధ్యాలను ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని మనం నిరూపించాం. ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. చంద్రయాన్-3 అడుగుపెట్టినటువంటి ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‎గా నామకరణం చేస్తున్నాం. ఈ చంద్రయాన్ – 3ప్రయోగంలో నారీ శక్తి ఎంతో ఉంది. సృష్టికే ఆధారం నారిశక్తి. భారత్‌ అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తోందని.. ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పుడు ఇస్రో సాధించినటువంటి ఈ విజయం ఎన్నో దేశాలకు స్పూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..