AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination Record: వ్యాక్సినేషన్ రికార్డు.. ఇదీ 130 కోట్ల మంది భారతీయుల విజయం..

ఉద్యమం.. మహోద్యమం.. కరోనా నుంచి ప్రజలను రక్షించడమే టార్గెట్‌.. ఇదే లక్ష్యంతో స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు చేపట్టింది కేంద్రం. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇవాళ100కోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసింది.

Vaccination Record: వ్యాక్సినేషన్ రికార్డు.. ఇదీ 130 కోట్ల మంది భారతీయుల విజయం..
Vaccine
Srinivas Chekkilla
|

Updated on: Oct 21, 2021 | 7:46 PM

Share

ఉద్యమం.. మహోద్యమం.. కరోనా నుంచి ప్రజలను రక్షించడమే టార్గెట్‌.. ఇదే లక్ష్యంతో స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు చేపట్టింది కేంద్రం. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇవాళ100కోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసింది. 9 నెలల్లోనే సరికొత్త రికార్డ్‌ సృష్టించింది భారతావాణి. కరోనా వ్యాక్సినేషన్‌లో వందకోట్ల డోసుల మైలురాయిని దాటేసింది. చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా నిలిచింది. 275 రోజుల్లోనే వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసి వేడుకలు నిర్వహించింది. ప్రధాని మోదీ మనోహర్ లోహియా ఆసుపత్రికి చేరుకుని 100 కోట్ల టీకా డోసును ఇచ్చారు.100 కోట్ల టీకాను దివ్యాంగుడైన అరుణ్ రాయ్ తీసుకున్నారు. అతను యూపీలోని వారణాసికి చెందినవారు.

అప్పుడు ఛావి అగర్వాల్‌(25) అనే దివ్యాంగురాలు టీకా వేయించుకునేందుకు అక్కడికి వచ్చారు. ఆమె అక్కడే ప్రాంగణంలో ఉండగా.. అటుగా వెళ్తోన్న మోదీని చూసి, ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పట్టలేని సంతోషంతో ప్రధానిని గట్టిగా పిలిచారు. తననెవరో పిలుస్తున్నారని, వెనక్కి తిరిగిన మోదీకి ఛావి కనిపించారు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఇంతకాలం ఎందుకు టీకా తీసుకోలేదని మోదీ ఆమెను ప్రశ్నించారు. దగ్గు కారణంగా కుదరలేదని చెప్పారు. అలాగే ఆమె ఇష్టాఇష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాటలు పాడటమంటే ఇష్టమని తెలుసుకొని.. ఒక పాట పాడించుకొని విన్నారు. ఆ అమ్మాయి అభ్యర్థన మేరకు ఆమెతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారు. మళ్లీ త్వరలో కలుస్తానని మాట కూడా ఇచ్చారు. దాంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ఛావికి ఈ రోజు ప్రత్యేకంగా మారిపోయింది.

Modi Saon

Modi

వ్యాక్సినేషన్‌లో ఇవాళ గోల్డెన్‌ డేగా అభివర్ణించారు ప్రధాని మోదీ..130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తిని చూశామన్నారు. అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన సంస్థలకు, ఈ ఘనత సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమవగా.. మొదటి దశలో కొవిడ్‌ వారియర్స్‌కు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి సెకండ్‌ ఫేజ్‌లో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ చేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తున్నారు. తొలుత కొన్ని రకాల భయాలు, అపోహలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగినా.. సెకండ్‌వేవ్‌ కరోనా విజృంభణతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా రెండున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. ఆగస్ట్‌ 6నాటికి 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తవగా.. ఇవాళ వంద కోట్ల మార్క్‌ను దాటేసింది భారత్. ఇక ఇప్పటివరకు 31 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది.

100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల మైలు రాయిని అందుకున్నందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ భారత్‌ను అభినందించింది. తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని WHO చీఫ్‌ టెడ్రోస్‌, సౌత్‌ ఏసియా రీజనర్‌ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు.

Read Also..  100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..