Crime News: అక్రమంగా ఆయుధాల స్మగ్లింగ్.. జాతీయ కబడ్డీ క్రీడాకారుడు అరెస్ట్.. ప్లాన్‌తో షాకిచ్చిన పోలీసులు..
National Kabaddi player arrested: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని
National Kabaddi player arrested: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు గుణ పోలీసులు తెలిపారు. అరెస్టయిన క్రిడాకారుడు రింకు జాట్‌గా పోలీసులు పేర్కొన్నారు. గుణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి క్రెటా కారులో గుణ నుంచి శివపురి వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. ముందస్తుగా సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను పట్టుకునేందుకు మైనా ఓవర్ బ్రిడ్జిను సైతం బ్లాక్ చేశారు. ఈ క్రమంలో నిందితుల కారు అటువైపు రావడంతో ఆ కారుని ఆపి అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు నిందితుల నుంచి 5 పిస్టల్ మ్యాగజైన్‌లతో సహా మూడు అదనపు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుర్హాన్‌పూర్‌కు చెందిన సిగ్లిగార్‌ల నుంచి పిస్టల్స్ తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ తుపాకులను సరఫరా చేసిన వ్యక్తి సమాచారం గురించి నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేసేందుకు ఒక బృందాన్ని అక్కడకు పంపించామని పోలీసులు తెలిపారు.
కబడ్డీ క్రిడాకారుడు రింకు, రాంపాల్ హర్యానాలోని సోనిపట్ నివాసితులు కాగా, అమీర్ ఖాన్, మహేంద్ర రావత్ మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కాగా.. రింకు జాట్ జాతీయ కబడ్డీ జట్టులో ప్రస్తుతం ఆడుతున్నాడని తెలిపారు. అతను గతంలో ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్లతో పాటు దబాంగ్ ఢిల్లీ జట్టు తరపున ఆడాడు.
Also Read: