Forest Office: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌లో భారీ దోపిడీ.. లక్షల విలువచేసే వస్తువులు మాయం.. అది వారి పనేనా..?

Forest Office: ప్రభుత్వ కార్యాలయం దొంగలు పడ్డారు. అందినకాడికి దోచుకెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు.. లక్షల విలువైన సామాగ్రిని మాయం చేశారు.

Forest Office: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌లో భారీ దోపిడీ.. లక్షల విలువచేసే వస్తువులు మాయం.. అది వారి పనేనా..?
Forest Office
Follow us

|

Updated on: Oct 22, 2021 | 5:52 AM

Forest Office: ప్రభుత్వ కార్యాలయం దొంగలు పడ్డారు. అందినకాడికి దోచుకెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు.. లక్షల విలువైన సామాగ్రిని మాయం చేశారు. అది కూడా నిత్యం రద్దీగా ఉండే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జరిగింది. అవునండీ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అందినకాడికి దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గ్రామాల్లో అక్రమ పోడు వ్యవసాయం ఎక్కడ చేపట్టినా సంబంధిత వాహనాల్ని సీజ్ చేసి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలిస్తారు. ఈ కార్యాలయం పరిధిలో దాదాపు 20 నుంచి 30 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అటవీ శాఖా కార్యాలయంలోని వాహనాలకు గట్టి భద్రత, ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది. అలాంటి ఈ కార్యాలయంలో దొంగతనం జరగటం ఇప్పుడు కలకలం రేపుతుంది.

అటవీ భూముల్లో అనుమతి లేకుండా వాహనాలతో ఏ పని చేయనివ్వరు. క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది నిరంతరం పోడు భూముల్ని ఓ కంట కనిపెడుతూ అక్రమంగా పనిచేసేవారిపై, వాహనాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతారు. వాహనాలను సైతం సీజ్ చేస్తారు. అలా సీజ్ చేసిన ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు రాత్రికి రాత్రే మాయం అయిన సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఏడాది కిందట అటవీ ప్రాంతంలో అక్రమంగా పోడు సాగు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. ట్రాక్టర్‌ని సీజ్ చేసి కొత్తగూడలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇక్కడ భద్రంగా ఉండాల్సిన ట్రాక్టర్ విడిభాగాలు మాయమయ్యాయి. రెండు టైర్లు, సహా విడిభాగాలు గత రాత్రి నుండి కనపడట్లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. వీటి విలువ దాదాపు లక్ష వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విలువ ఎంతైన ఉండొచ్చు, కానీ, దొంగతనం ఎలా జరిగింది..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అటవీశాఖ సిబ్బంది హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Viral News: ఆన్‌లైన్‌లో చిప్స్‌ ఆర్డర్‌ చేశాడు.. ప్యాక్ తెరిచి చూస్తే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..!

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..

Andhra Pradesh: మెడికల్ కాలేజీ తెచ్చిన తంటా.. కర్నూలులో ఆ రెండు కుటుంబాల మధ్య పేలుతున్న మాటల తూటాలు..!