Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చాలా బాధాకరం.. మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగం..

మహా కుంభమేళా.. ఆపై మౌని అమావాస్య.. ఇవాళే ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్‌కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమచారం.. దీనిపై యుపీ సర్కారు అధికారిక ప్రకటన చేయలేదు..

PM Modi: చాలా బాధాకరం.. మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగం..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2025 | 12:48 PM

మహా కుంభమేళా.. ఆపై మౌని అమావాస్య.. ఇవాళే ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్‌కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమచారం.. దీనిపై యుపీ సర్కారు అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.. వివిధ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. మహాకుంభ్‌ సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.. అర్ధరాత్రి తర్వాత.. సంగం ఘాట్‌ దగ్గర విపరీతమైన రద్దీతో క్యూలైన్‌లో ఒక్కసారిగా తోపులాట జరిగింది.. బారికేడ్‌ విరగడంతో పక్కనే నిద్రిస్తున్నవారిపై జనం పడిపోయారు. తొక్కిసలాట, హాహాకారాలతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.. సెక్టార్‌-4లో తెల్లవారు జామున ఒంటి గంట 30 నిమిషాలకు తొక్కిసలాట జరిగింది. స్వరూప్‌ రాణి ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. మృతుల్లో పిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై మాత్రం యూపీ సర్కార్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.. ప్రయాగ్‌రాజ్‌ తొక్కిసలాటపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.. ఉదయం నుంచి యూపీ సీఎం యోగితో 4 సార్లు మాట్లాడారు ప్రధాని మోదీ.. సహాయ చర్యలు, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.. ఈ తరుణంలో తొక్కిసలాట ఘటన చాలా బాధకరం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట ఘటన, ప్రస్తుత పరిణామాలపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కుంభమేళాలో జరిగిన దుర్ఘటన బాధాకరం అంటూ పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన భక్తులకు తన సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. బాధితులకు సాధ్యమైనంతగా అధికార యంత్రాంగం సాయం చేస్తోందన్నారు.యూపీ సీఎం యోగితో మాట్లాడుతున్నానని మోదీ చెప్పారు.

ప్రధాని మోదీ ట్వీట్..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం సీఎం యోగితో మాట్లాడారు.. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని అమిత్‌షా ప్రకటించారు. మౌని అమావస్య సందర్భంగా, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కలచివేసింది. అక్కడి దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఈ ఘటన అనంతరం భారీగా బలగాలను మోహరించారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..