మోదీ ప్రశంసలు.. ఉబ్బితబ్బిబ్బయిన రిక్షా పుల్లర్
వారణాసి సమీపంలోని డోమ్రీ గ్రామానికి చెందిన రిక్షాపుల్లర్ కేవత్ ఆనందానికి హద్దులు లేవు. స్వయంగా ప్రధాని మోదీని కలిసిన ఘటన ఒకవైపు, ఆయననుంచి తనకు అందిన ప్రశంసలు మరో వైపు ఆ పేద రిక్షాకార్మికుడిని కొద్దిసేపు అత్యంత సంతోషంలో ముంచెత్తాయి. తన కుమార్తె పెళ్ళికి మోదీ నుంచి అందిన దీవెన లేఖ ఇప్పటికే కేవత్ ని ఆనంద పరవశుడ్ని చేయగా.. తనను కలుసుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఓ ఆహ్వానం అతనికి అందింది. సోమవారం మోదీ […]
వారణాసి సమీపంలోని డోమ్రీ గ్రామానికి చెందిన రిక్షాపుల్లర్ కేవత్ ఆనందానికి హద్దులు లేవు. స్వయంగా ప్రధాని మోదీని కలిసిన ఘటన ఒకవైపు, ఆయననుంచి తనకు అందిన ప్రశంసలు మరో వైపు ఆ పేద రిక్షాకార్మికుడిని కొద్దిసేపు అత్యంత సంతోషంలో ముంచెత్తాయి. తన కుమార్తె పెళ్ళికి మోదీ నుంచి అందిన దీవెన లేఖ ఇప్పటికే కేవత్ ని ఆనంద పరవశుడ్ని చేయగా.. తనను కలుసుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఓ ఆహ్వానం అతనికి అందింది. సోమవారం మోదీ వారణాసిని సందర్శించిన సందర్భంగా కేవత్ ఆయనను కలిశాడు.. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా గంగానది శుద్దికి కేవత్ తన గ్రామంలో ఆ నది తీరాన్ని కొంతభాగం శ్రధ్దతో క్లీన్ చేశాడని తెలిసి మోదీ అతడ్ని అభినందించారు. అతని కుటుంబ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అతని ఫ్యామిలీకి ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 12 న కేవత్ కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి హాజరు కావాలని కోరుతూ కేవత్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి కార్యాలయంలో శుభలేఖ ఇఛ్చాడు. దాన్ని చూసిన మోదీ ఆశీస్సులతో కూడిన లేఖను పంపిన సంగతి తెలిసిందే.