Narendra Modi: విజయ్‌భాయ్ ఇక లేరనే నిజాన్ని ఆంగీకరించలేకపోతున్నా- ప్రధాని మోదీ!
గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సందర్భంగా రూపానీతో తనకున్న అనుబంధాన్ని ప్రధానీ మోదీ గుర్తుచేసుకున్నారు. విజయ్‌భాయ్ లేరంటే నమ్మలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు.

గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విజయ్ రూపానీతో పాటు ఫ్లైట్‌లో ఉన్న 12 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు మాత్రం సజీవంగా బయటపడ్డారు. ఈ దుర్ఘన దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా ఈ ప్రమాదంలో బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మరణించడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శక్రవారం ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. రూపానీతో తనకున్న అనుబంధాన్ని ప్రధానీ మోదీ గుర్తుచేసుకున్నారు. విజయ్‌భాయ్ లేరంటే నమ్మలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. విజయ్‌భాయ్‌తో తనకు ఎన్నో ఏళ్ల అనుభందం ఉందని.. ఇద్దరం కలిసి ఎన్నో క్లిష్ట పరిస్తితులను ఎదుర్కొన్నామని తెలిపారు. విజయ్ భాయ్ అత్యంత నిరాడంబరమైన, సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తని, ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారని ప్రధాని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Met the family of Shri Vijaybhai Rupani Ji.
It is unimaginable that Vijaybhai is not in our midst. I’ve known him for decades. We worked together, shoulder to shoulder, including during some of the most challenging times. Vijaybhai was humble and hardworking, firmly committed… pic.twitter.com/KbmDsKtARG
— Narendra Modi (@narendramodi) June 13, 2025
ఆయన ఏ పదవిలో ఉన్న దాని న్యాయం చేసేవారని తెలిపారు. విజయ్‌భాయ్ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తను లభించింది ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. గుజరాత్ అభివృద్ధికి కూడా ఆయన ఎంతగానో తోడ్పడ్డారని ఆయన తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశాలు, చర్చలు తనకు ఎప్పటికీ గుర్తుంటాయని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.




