PM Modi: ఎడ్ షీరన్, అర్జిత్ సింగ్‌ల సాఫీర్ ప్రదర్శనను ఆస్వాదించిన భారత, బ్రిటన్ ప్రధానులు
జులైలో భారత్-బ్రిటన్ మధ్య ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం తర్వాత తొలిసారి రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను మరింత విస్తృతం చేయడంపై తాజాగా మోదీ-స్టార్మర్ చర్చలు జరుపుతున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మన దేశంలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరుస్తుందని దౌత్య నిపుణులు చెబుతున్నారు. కాగా తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా తన X ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇది భారత్-యూకే కల్చరల్ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది. వీడియోలో బ్రిటీష్ పాప్ స్టార్ ఎడ్ షీరన్, ఇండియన్ సింగర్ అర్జిత్ సింగ్ పాటలను కలిపి చేసిన సంగీత ప్రదర్శనను ప్రధాని మోదీ, ఇంగ్లాడ్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ ట్రాక్ షీరాన్ పాశ్చాత్య పాప్ ధ్వనితో పాటు భారతీయ, ముఖ్యంగా పంజాబీ సంగీత ప్రభావాలతో మిళితం అయి ఉంది. ఇది క్రాస్-కల్చరల్ థీమ్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ పాట జూన్ 2025లో షీరాన్ ఎనిమిదవ స్టూడియో ఆల్బమ్ ప్లే నుంచి మూడవ సింగిల్‌గా విడుదలైంది.
Wonderful rendition of Ed Sheeran & Arijit Singh’s Sapphire, which is a great example of India-UK cultural partnership! pic.twitter.com/aLtx5WyiXT
— Narendra Modi (@narendramodi) October 9, 2025
మోదీ కోట్ చేసినట్లుగా ఈ సంగీత ప్రదర్శన రెండు దేశాల సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. భారతీయ సంగీత సామర్థ్యాన్ని అంతర్జాతీయ మైదానంలో చూపించేలా, యూకే ఆర్టిస్ట్‌లతో కలిసి రూపొందించిన ఈ రాక్-క్లాసిక్ వాయిస్ కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంగీతం, సాంస్కృతిక మార్పిడి, సృజనాత్మకత ద్వారా భారతీయ-యూకే సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ప్రదర్శనను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా యువతను, సంగీత ప్రేమికులను స్ఫూర్తి పరుస్తుందని మోదీ తెలిపారు.
ఈ వీడియో వైరల్‌గా మారి, సంగీత ప్రేమికుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. భారత్-యూకే కల్చరల్ పార్టనర్‌షిప్‌కు ఒక గుర్తింపు ఇస్తూ, సృజనాత్మకతలో అంతర్జాతీయ స్థాయిలో అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.




