AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జస్ట్‌ మిస్‌.. ఊపిరి బిగపట్టి చూడండి… ఒక్కక్షణం అటు ఇటు అయినా అంతే సంగతులు

గాషారం బాగా లేకుంటే తాడే పామై కరుస్తుందంటారు. కానీ, అదృష్టం ఉంటే మాత్రం పాము కూడా తాడుగా మారుతుంది. కొంతమంది ఒక్కోసారి రవ్వంలో ప్రాణాపాయం నుంచి రవ్వంతలో తప్పించుకుంటూ ఉంటారు. ఆ సంఘటనలు చూసిన తర్వాత తప్పించుకున్నారు అనే బదులు తప్పిపోయింది అంటేనే కరెక్ట్‌గా...

Viral Video: జస్ట్‌ మిస్‌.. ఊపిరి బిగపట్టి చూడండి... ఒక్కక్షణం అటు ఇటు అయినా అంతే సంగతులు
Land Slide On Car Bannet
K Sammaiah
|

Updated on: Oct 09, 2025 | 6:02 PM

Share

గాషారం బాగా లేకుంటే తాడే పామై కరుస్తుందంటారు. కానీ, అదృష్టం ఉంటే మాత్రం పాము కూడా తాడుగా మారుతుంది. కొంతమంది ఒక్కోసారి రవ్వంలో ప్రాణాపాయం నుంచి రవ్వంతలో తప్పించుకుంటూ ఉంటారు. ఆ సంఘటనలు చూసిన తర్వాత తప్పించుకున్నారు అనే బదులు తప్పిపోయింది అంటేనే కరెక్ట్‌గా సూటవుతుంది. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియలో త్వరగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ షాకింగ్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో కొన్ని వాహనాలు వెళుతుండటం చూడొచ్చు. ఆ పక్కనే లోయలో నది ప్రవహిస్తుండటం కనిపిస్తుంది. ఎత్తైన ఆ ఘాట్‌ రోడ్ మార్గంలో వాహనాలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ఘాట్‌రోడ్డు అనగానే ఎంతో జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో జరిగిన సంఘటన మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కొండ పై నుంచి ఒక పెద్ద బండరాయి గాల్లో ఎగురుకుంటూ కార్లవైపు దూసుకొచ్చింది. ఈ సమయంలో జరిగిన అద్భుతమే అదృష్టంగా భావించొచ్చు. ఆ బండరాయి కారు ముందు బానెట్‌ మీదుగా ఒరుసుకుంటూ అవుతలి వైపు అంతే స్పీడ్‌గా దుసుకెళ్లింది. ఆ బండరాయి కొంచెం తగిలినందుకే కారు బానెట్‌ డ్యామేజ్‌ అయింది. ఒకవేళ ఆ రాయి కారు మీద పడి ఉంటే కారుతో పాటు అందులోని ప్రయాణికులు ఏమైపోయేవారో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.

వీడియో చూడండి:

కిన్నౌర్‌లోని నాథ్పా పాయింట్ వద్ద జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ కారు డ్యాష్‌ క్యామ్‌లో రికార్డు అయ్యాయి. దీంతో ఆ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించి కామెంట్స్‌ పెడుతున్నారు. వర్షా కాలంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?