PM Modi: భారత్, సనాతన ధర్మం గురించి ఆచితూచిగా మాట్లాడాలి.. ప్రధాని మోదీ కీలక సూచనలు
భారత్, సనాతన ధర్మం.. అంశాలపై ఆచిచూచిగా మాట్లాడాలని.. కేంద్రమంత్రులను ప్రధానీ మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో భారత్ అంశం గురించి ప్రధాని మోదీ మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై ఎక్కువగా స్పందించకూడదని కేంద్ర మంత్రులకు ఆయన సూచనలు చేసినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్పాయి.

భారత్, సనాతన ధర్మం.. అంశాలపై ఆచిచూచిగా మాట్లాడాలని.. కేంద్రమంత్రులను ప్రధానీ మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో భారత్ అంశం గురించి ప్రధాని మోదీ మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై ఎక్కువగా స్పందించకూడదని కేంద్ర మంత్రులకు ఆయన సూచనలు చేసినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్పాయి. అయితే ఇది కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు మంత్రి సనాతన ధర్మం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు ఆయన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
చరిత్ర లోతుల్లోకి తొంగిచూడకూడదని.. కానీ రాజ్యాంగం ప్రకారమే వాస్తవాలకు కట్టుబడి ఉండాలని.. అలాగే సమకాలీన పరిస్థితులు గురించి మాట్లాడాలని చెప్పినట్లు తెలుస్తోంది. వివాదస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరం అని ప్రధాని మోదీ సూచనలు పలు మీడియా సంస్థలు తెలిపాయి. అలాగే జీ20 విదేశీ అతిథుల కోసం పంపిణీ చేస్తున్న ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం రాజకీయంగా దుమారం రేపింది. అలాగే తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌కి బదులు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ముద్రించడంతో ఈ దుమారం మరింత ముదిరింది. దీంతో ఆంగ్లంలో కూడా దేశం పేరను ఇకనుంచి భారత్ మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక జీ20 సదస్సు జరగనున్న వేళ విదేశాల నుంచి వచ్చే దేశాధినేతలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు. సమావేశం జరగనున్న భారత్ మండపంతో పాటు ఇతర వేదికల వద్దకు చేరేందుకు అధికారిక వాహనాలను పక్కన పెట్టేయాలని.. షటిల్ సర్వీసులను ఉపయోగించాలని అన్నారు.
అలాగే జీ20 ఇండియా మొబైల్ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచనలు చేశారు. దీనివల్ల విదేశి ప్రతినిధులతో జరిపేటటువంటి సంభాషణల్లో అందులో అనువాద సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఈ యాప్ అన్ని భారతీయ భాషలతో సహా.. జీ20 దేశాల భాషలను అనువాదం చేయగలదు. అంతర్జాతీయ సంస్థలకు చెందినటువంటి అధిపతులతో సహా.. 40 మంది ప్రపంచ నేతలు ఈ నెల 9,10వ తేదీల్లో జరిగే జీ20 సదస్సుకు హాజరవుతున్నారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా కేంద్ర మంత్రులకు సూచనలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రోటోకాల్‌కు సంబంధించినటువంటి విషయాలను కూడా వెల్లడించారు. విదేశీ ప్రముఖులను ఆహ్వానించేటటువంటి బాధ్యతలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొందరు మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








