AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shinkun La Tunnel: ప్రపంచంలోనే అత్యంత పొడవైన.. షిన్‌కున్ లా టన్నల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

లడఖ్ రూపురేఖలను పూర్తిగా మార్చేయగల షిన్‌కున్ లా టన్నల్‌ను కార్గిల్ దివాస్ వేదికగా ప్రారంభించారు ప్రధాని మోదీ. కార్గిల్ దివాస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఈ షిన్‌కున్ లా సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు. గతేడాది

Shinkun La Tunnel: ప్రపంచంలోనే అత్యంత పొడవైన.. షిన్‌కున్ లా టన్నల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
Pm Modi Shinkunla Tunnel
Ravi Kiran
|

Updated on: Jul 26, 2024 | 11:41 AM

Share

లడఖ్ రూపురేఖలను పూర్తిగా మార్చేయగల షిన్‌కున్ లా టన్నల్‌ను కార్గిల్ దివాస్ వేదికగా ప్రారంభించారు ప్రధాని మోదీ. కార్గిల్ దివాస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఈ షిన్‌కున్ లా సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఈ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇది అందుబాటులోకి వస్తే అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మనాలి నుంచి లేహ్ కు.. దార్చా-పడుమ్-నిమ్ము గుండా సులభంగా చేరుకోవచ్చు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) షిన్‌కున్ లా పాస్ కింద 15,800 అడుగుల ఎత్తులో 4.1 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. ఈ ట్విన్-ట్యూబ్ సొరంగ మార్గం ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 1,681 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దార్చా-పడుమ్-నిమ్ము రోడ్డు పొడవు 297 కిలోమీటర్లు. దీనిలో 100 కిలోమీటర్ల మేరకు ఇప్పటికే డబుల్ లేన్ ఉంది. ఇది బ్లాక్ టాప్ రోడ్డు. కొత్త రోడ్డు నిర్మాణం వల్ల మనాలీ-లేహ్ మధ్య దూరంలో మార్పు ఉండదు. అయితే మంచు బారిన పడకుండా ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలవుతుంది. లడఖ్, కార్గిల్, సియాచిన్ సెక్టర్లలో ఉండే భారత సైన్యానికి ఆహారం, ఆయుధాలు వంటివాటిని సరఫరా చేయడం సులువవుతుంది.

ప్రతి 500 మీటర్లకు క్రాస్ పాసేజి‌లు ఉండే షిన్‌కున్ లా సొరంగం పూర్తి కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. “చైనాలోని 15,590 అడుగుల ఎత్తులో ఉన్న మి లా టన్నెల్‌ను దాటవేస్తే, ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం మార్గంగా రికార్డు సృష్టించింది. ఇది దళాలు, భారీ ఆయుధ వ్యవస్థల సమర్ధవంతంగా, అలాగే వేగంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా.. లడఖ్‌లో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.” అని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..