AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించేది ఆ రంగమే.. ఇండియా ఎనర్జీ వీక్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ..

టర్కీలో సంభవించిన భూకంపంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విధ్వంసక భూకంపాన్ని మనందరం చూస్తున్నాం. పలువురు మృతి చెందడంతో పాటు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వారికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

PM Modi: ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించేది ఆ రంగమే.. ఇండియా ఎనర్జీ వీక్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 06, 2023 | 1:12 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ (IEW – 2023) సదస్సును ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో.. ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసిన సోలార్ కుకింగ్ సిస్టమ్ ట్విన్-కుక్‌టాప్ మోడల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంధన రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కొత్త శక్తి వనరులను అభివృద్ధి చేయడంలో, శక్తి పరివర్తనలో భారతదేశం నేడు బలమైన దేశాలలో ఒకటిగా ఉందని.. అగ్రస్థానానికి తీసుకెళ్లేందు ప్రయత్నాలు చేస్తున్నామంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ G20 ప్రెసిడెన్సీ క్యాలెండర్‌లో ఇది మొదటి ప్రధానమైన ఈవెంట్ అంటూ పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాన్నారు. బెంగళూరు సాంకేతికత, ప్రతిభ, ఆవిష్కరణల శక్తితో నిండిన నగరం అంటూ మోడీ కొనియాడారు. నిరంతరం యువ శక్తిని ఉపయోగించుకుంటూ ఉండాలంటూ సూచించారు.

బాహ్య పరిస్థితులు ఏమైనప్పటికీ, అంతర్గత దృఢత్వం కారణంగా భారతదేశం అన్ని సవాళ్లను అధిగమిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. దాని వెనుక అనేక అంశాలు ఉన్నాయన్నారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం, స్థిరమైన సంస్కరణలు.. అట్టడుగు స్థాయిలో సామాజిక-ఆర్థిక సాధికారత అనే మూడు అంశాల గురించి వివరించారు. ఇటీవల, IMF 2023 వృద్ధి అంచనాను విడుదల చేసిందని.. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని పేర్కొందని తెలిపారు. మహమ్మారి, యుద్ధం ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం 2022లో ప్రపంచ ప్రకాశవంతమైన దేశంగా నిలిచిపోయిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

భూకంప బాధితులకు సహాయం అందిస్తాం..

కాగా, టర్కీలో సంభవించిన భూకంపంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విధ్వంసక భూకంపాన్ని మనందరం చూస్తున్నాం. పలువురు మృతి చెందడంతో పాటు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. టర్కీకి సమీపంలోని దేశాల్లో కూడా నష్టం జరిగింది. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల సానుభూతి భూకంప బాధిత ప్రజలందరికీ తోడుగా ఉందని తెలిపారు. భూకంప బాధిత ప్రజలకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సిఎం బసవరాజ్ బొమ్మై తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రీన్ మొబైలిటీ ర్యాలీని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ తుమకూరులోని హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..