AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆ బంధం మాటల్లో చెప్పలేనిది.. మోదీ ఎమోషనల్‌ పోస్ట్‌

ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో పాటు, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధినేతలకు ఆహ్వానం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...

PM Modi: ఆ బంధం మాటల్లో చెప్పలేనిది.. మోదీ ఎమోషనల్‌ పోస్ట్‌
Pm Modi
Narender Vaitla
|

Updated on: May 14, 2024 | 9:00 AM

Share

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది. సోమవారం 4వ దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగం మరో కీలక ఘట్టానికి తెర లేవనుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ వేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో పాటు, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధినేతలకు ఆహ్వానం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాని హాజరవుతున్నారు.

ఇక మరికొన్ని గంటల్లో నామినేషన్‌ దాఖలు చేయనున్న క్రమంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. వారణాసితో తనకు ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ వీడియోను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ వీడియోలో మోదీ తొలిసారి వారణాసిని ఎప్పుడు సందర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని ఎలా ప్రారంభించారు. లాంటి వివరాలను పేర్కొన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారణాసి రూపురేఖలు ఎలా మారాయన్న విషయాన్ని ఇందులో సవివరంగా వివరించారు. ఇక వీడియోతో పాటు నరేంద్ర మోదీ.. ‘కాశీతో నా అనుబంధం అద్భుతమైంది. సమగ్రమైంది, సాటిలేనిది. ఈ భావాన్ని మాటల్లో వ్యక్తీకరించలేను’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్..

ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. సుమారు 6 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగింది. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్‌ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి తన యాత్రను ఆయన ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం