AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation: ఆస్పత్రి నిర్వాకం.. సర్జరీ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు! ఆ తర్వాత ఏం జరిగిందంటే!

ఓ డాక్టర్‌ నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ కడుపులో దూదిని వదిలేశాడా డాక్టర్‌. డిశ్చార్జ్​అయి ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో పరుగుపరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్​చేశారు. దీంతో పేషెంట్‌ కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్‌ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం..

Operation: ఆస్పత్రి నిర్వాకం.. సర్జరీ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు! ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Representative Image
Srilakshmi C
|

Updated on: May 14, 2024 | 8:39 AM

Share

లక్నో, మే 14: ఓ డాక్టర్‌ నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ కడుపులో దూదిని వదిలేశాడా డాక్టర్‌. డిశ్చార్జ్​అయి ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో పరుగుపరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్​చేశారు. దీంతో పేషెంట్‌ కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్‌ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్‌లో జరిగింది. ఇదీ జరిగింది..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు లోహియానగర్‌క చెందిన సల్మాన్‌ అనే వ్యక్తి పిత్తాశయంలో అనారోగ్యం కారణంగా అదే ప్రాంతంలోని హాపుర్ రోడ్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. అక్కడ గత నెలలోనే ఓ వైద్యుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. అయితే వైద్యుడు ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు. సర్జరీ తర్వాత పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోగా.. నానాటికీ మరింత క్షీణించసాగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా.. అతడి కడుపులో దూది ఉండటం చూసి షాకయ్యారు. దీంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాటన్ స్ట్రిప్‌ను తొలగించారు. అయితే తప్పు చేసినా.. ఆస్పత్రి వర్గాలు బుకాయించడం విడ్డూరంగా మారింది.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడని, సదరు ఆస్పత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బిలాల్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోహియా నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి సంజయ్ సింగ్ తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..