Niti Aayog Meeting: టార్గెట్ వికాసభారత్@2047.. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం..
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో నీతిఆయోగ్ సమావేశం జరుగుతోంది. వికాసభారత్ @ 2047 అన్న థీమ్‌తో ఈసారి నీతిఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో నీతిఆయోగ్ సమావేశం జరుగుతోంది. వికాసభారత్ @ 2047 అన్న థీమ్‌తో ఈసారి నీతిఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2047 నాటికి భారత్ ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చించారు. దీంతోపాటు జీ20 సర్వసభ్య సమావేశం, నిర్వహణ.. ఆర్థిక వృద్ధి, తదితర అంశాలపై ప్రధాని ప్రస్తావించారు. ముఖ్యంగా భారత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కీలక విషయాలపై నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ ఈ సమావేశానికి రాలేదు. అయితే, నీతిఆయోగ్ సమావేశంలో గతంలో తాము ప్రస్తావించిన సమస్యలకు ఇప్పటికి పరిష్కారం లభించలేదన్నారు మమత. అందుకే ఈ సమావేశానికి హాజరుకావడం లేదని వివరణ ఇచ్చారు.
ఈ సమావేశానికి హాజరవ్వాలనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరగా నిర్ణయాన్ని మార్చుకున్నారు. వీరి నిర్ణయం తర్వాత కేంద్రం తీసుకువచ్చిన ఆర్టినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..