AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బలమైన ప్రభుత్వాన్ని గెలిపించడం వల్లే ఇది సాధ్యమైంది.. మహిళ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ఉద్దేశించినటువంటి బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేజన్ కల్పించడం అనేది సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో పూర్తిగా సంపూర్ణ మెజార్టీతో బలమైన ప్రభుత్వం ఆవశ్యకతను చాటిచెప్పారు ప్రధాని మోదీ.

PM Modi: బలమైన ప్రభుత్వాన్ని గెలిపించడం వల్లే ఇది సాధ్యమైంది.. మహిళ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Pm Narendra Modi
Aravind B
| Edited By: |

Updated on: Sep 23, 2023 | 9:44 AM

Share

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ఉద్దేశించినటువంటి బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేజన్ కల్పించడం అనేది సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో పూర్తిగా సంపూర్ణ మెజార్టీతో బలమైన ప్రభుత్వం ఆవశ్యకతను చాటిచెప్పిన ప్రధాని మోదీ.. దీని ద్వారానే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగులో ఉన్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ మహిళా మోర్చా సత్కార అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా నేతలకు వినమ్రంగా నమస్కారం చేశారు.

ఇదిలా ఉండగా.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే అంశం అనేది వాస్తావానికి దాదాపు మూడు దశాబ్దాలుగా నానుతూనే వచ్చింది. గతంలో ఉన్నటువంటి పాలకులకు సైతం ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును విజయవంతంగా ఆమోదించలేకపోయారు. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును విజయవంతంగా పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించింది. అయితే ఈ క్రమంలోనే దశాబ్ద కాలంలో మహిళలు ఒక శక్తిగా ఎదిగిన పరిస్థుతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకోసమే.. గతంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపేసినటువంటి రాజకీయ పార్టీలే ఇప్పుడు మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అలాగే పూర్తి మెజారిటీతో బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే ఈ బిల్లును ఆమోదించడం సాధ్యమైనట్లు తెలిపారు ప్రధాని మోదీ. అంతేకాదు.. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం పది సంవత్సరాల కాలంలో వివిధ పథకాలను సైతం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. మరోవైపు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు అంటే బుధవారం నాడు లోక్‌సభలో కూడా విజయవంతంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఉభయసభల్లో ఆమోదించడం అనేది పార్లమెంటరీ చరిత్రలోనే ఒక సువర్ణ ఘట్టమంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మరో విషయం ఏంటంటే చట్టసభల్లో 33 శాతం మహిళలకు ఉద్దేశించిన ఈ బిల్లు డిలిమిటేషన్ తర్వాతే అమలు అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి