Viral: వీడేం మనిషిరా.! విమానంలో అనూహ్య సంఘటన.. భయంతో ప్రయాణికులు కేకలు..!

Viral: వీడేం మనిషిరా.! విమానంలో అనూహ్య సంఘటన.. భయంతో ప్రయాణికులు కేకలు..!

Anil kumar poka

|

Updated on: Sep 22, 2023 | 9:33 PM

గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయానికుడు చేసిన పనికి ప్రయాణికులు భయంతో కంగారుపడ్డారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడు గాలిలోనే విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెప్టెంబర్ 21న అగర్తలలోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో విమానం దిగడానికి

గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయానికుడు చేసిన పనికి ప్రయాణికులు భయంతో కంగారుపడ్డారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడు గాలిలోనే విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెప్టెంబర్ 21న అగర్తలలోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో విమానం దిగడానికి 10 నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో అతడు డ్రగ్స్‌ మత్తులో ఉన్నట్లు సమాచారం. త్రిపుర పోలీసు ప్రతినిధి జ్యోతిస్‌మన్ దాస్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా డమ్ డమ్ విమానాశ్రయంలో దేబ్‌నాథ్ అనే వ్యక్తి గువాహటి మీదుగా అగర్తలా వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. అగర్తలలో విమానం మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా, ఆ వ్యక్తి తన సీట్లోంచి పరుగున వెళ్లి విమానం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. ఓ ఎయిర్ హోస్టెస్ దేబ్ నాథ్ ప్రయత్నాన్ని పసిగట్టి, అతడిని అడ్డుకుంది. ప్రయాణికుల సాయంతో అతడిని వెనక్కి లాగేసింది. అపై, దేబ్ నాథ్ విమాన సిబ్బంది, తోటి ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మళ్లీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహించిన ఇతర ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. దేబ్ నాథ్ ను సీఐఎస్ఎఫ్ పోలీసులు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అనంతరం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడిపై అగర్తల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దేబ్ నాథ్ డ్రగ్స్ కు బానిస అయ్యుంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఇండిగో సిబ్బంది కూడా గాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..