Singareni workers: సింగరేణి కార్మికుల ఖాతాల్లో లక్షలు జమ.. టాపర్ అతనే..!
సాధారణంగా దసరా పండుగకు ఉద్యోగులు, కార్మికులకు సంస్థలు బోనస్‌లు ఇస్తాయి. అలాగే సింగరేణి కార్మికులకు కూడా ప్రతి ఏటా విజయదశమికి ఇటు ప్రభుత్వం, అటు సింగరేణి సంస్థ కూడా బోనస్ ప్రకటిస్టుంటాయి. అయితే ఈ ఏడాది సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చేసింది. కార్మికుల ఖాతాలు లక్షలరూపాయలతో నిండిపోయాయి. కార్మికుల కుటుంబాల్లో ఆనందం నిండిపోయింది.
సాధారణంగా దసరా పండుగకు ఉద్యోగులు, కార్మికులకు సంస్థలు బోనస్‌లు ఇస్తాయి. అలాగే సింగరేణి కార్మికులకు కూడా ప్రతి ఏటా విజయదశమికి ఇటు ప్రభుత్వం, అటు సింగరేణి సంస్థ కూడా బోనస్ ప్రకటిస్టుంటాయి. అయితే ఈ ఏడాది సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చేసింది. కార్మికుల ఖాతాలు లక్షలరూపాయలతో నిండిపోయాయి. కార్మికుల కుటుంబాల్లో ఆనందం నిండిపోయింది. ఒక్కో కార్మికుడి ఖాతాలో కనీసం 3 లక్షలు పైనే జమ అయ్యాయి. కానీ, ఇది దసరా బోనస్ కాదు. 11వ వేజ్‌బోర్డు బకాయిల చెల్లింపుల ద్వారా అందించిన మొత్తం. 11వ వేజ్ బోర్డు బకాయిలు మొత్తం 1,450 కోట్లను యాజమాన్యం విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల బకాయిలను వారి ఖాతాల్లోకి బదిలీ చేసింది. సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి. వేతన బకాయిలు పొందిన వారిలో సింగరేణి టాపర్‌గా రామగుండం-1 ఏరియా హెడ్ ఓవర్‌మెన్ వేముల సుదర్శన్‌రెడ్డి 9.91 లక్షలతో అగ్రస్థానంలో నిలిచారు. 9.35 లక్షలతో రామగుండం-2 ఏరియాకు చెందిన ఈఐపీ ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్ రెండో స్థానంలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన 700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దీపావళి బోనస్ పీఎల్‌ఆర్‌ను కూడా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..