Viral: పాపం పోలీసులు..! టీ తాగేందుకు వ్యాన్ ఆపితే.. వ్యాన్ తో సహా జంప్ అయినా ఖైధీలు.
విధినిర్వహణ పోలీసులు ఏమరపాటుగా వ్యవహరించడంతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఖైదీలను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు ఓ చోట వ్యాన్‌ను నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. ఇంతలో పోలీసుల కళ్లు గప్పి ఖైదీలు తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు చేరి వైరల్‌గా మారింది.
విధినిర్వహణ పోలీసులు ఏమరపాటుగా వ్యవహరించడంతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఖైదీలను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు ఓ చోట వ్యాన్‌ను నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. ఇంతలో పోలీసుల కళ్లు గప్పి ఖైదీలు తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు చేరి వైరల్‌గా మారింది. రైల్వే స్టేషన్‌లో చోరీలకు పాల్పడి అరెస్టైన ఏడుగురు రిమాండ్ ఖైదీలను సెప్టెంబరు 19న ఝాన్సీ రైల్వే కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఒక చోట పోలీస్ వ్యాన్‌ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారట. అయితే ఖైదీలున్న ఆ వ్యాన్ వద్ద గస్తీగా పోలీసులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్‌లో ఉన్న ఏడుగురు ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించిన ఈ నిందితులు రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఎస్‌ఐలతో సహా ఎనిమిది మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే రిమాండ్ ఖైదీల పరార్‌పై కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

