AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశాభివృద్ధిని ఆపడమే విపక్షాల లక్ష్యం.. ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ.

భారత దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపకాక్ష మినిమమ్‌ కామన్‌ ప్రోగ్రామ్‌ అని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. మంగళవారం పోర్ట్‌ బ్లెయిర్‌లో వీర్‌ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్ భవాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని...

PM Modi: దేశాభివృద్ధిని ఆపడమే విపక్షాల లక్ష్యం.. ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ.
PM Modi
Narender Vaitla
|

Updated on: Jul 18, 2023 | 4:30 PM

Share

భారత దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపకాక్ష మినిమమ్‌ కామన్‌ ప్రోగ్రామ్‌ అని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. మంగళవారం పోర్ట్‌ బ్లెయిర్‌లో వీర్‌ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్ భవాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. అవినీతిని అడ్డుకునే చర్యలకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని మోదీ విమర్శించారు.

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు తమ కార్యకర్తలను గాలికి వదిలేసి టీఎంసీతో జత కట్టాయనన్నారు. కుటుంబ పార్టీలు యువత కోసం ఏనాడు ఆలోచించలేదన్న మోదీ.. తమ కుటుంబ పాలనను కాపాడుకోవడమే ఆ పార్టీల లక్ష్యమన్నారు. బెంగళూరులో విపక్ష పార్టీ నేతలు సమావేశమైన వేళ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇదిలా ఉంటే విపక్ష కూటమిని అత్యంత అవినీతిమయైన కూటమిగా ప్రజలు భావిస్తున్నారన్ని మోదీ తెలిపారు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి బెయిల్‌పై ఉన్నవారికి కూటమిలో గౌరవం లభిస్తుందని మోదీ ఎద్దేవ చేశారు. ఒక వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన వారికి కూడా ఆ కూటమిలో ప్రాధాన్యత ఇస్తారని మోదీ విమర్శించారు. యూపీఏ చేసిన తప్పులను తాము సరిదిద్దామమన్న మోదీ.. 2024లో ప్రజలు మరోసారి బీజేపీనే గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..