Watch Video: కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం .. యాక్సిడెంట్‌లో మరణిస్తే డబ్బులు వస్తాయని..

తాను మరణిస్తే ఆ వచ్చే డబ్బుతో కొడుకు చదువు కొనసాగుతుందని పాపతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషాద ఘటన రోడ్డు పక్కన ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బస్సు కింద పడడానికి పాపాతి రెండుసార్లు ప్రయత్నించింది.

Watch Video: కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం .. యాక్సిడెంట్‌లో మరణిస్తే డబ్బులు వస్తాయని..
Tn Mother's Fatal Sacrifice
Follow us
Surya Kala

|

Updated on: Jul 18, 2023 | 4:10 PM

తల్లి ప్రేమను మించింది సృష్టిలో మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తన కొడుకు చదువుకు ఫీజ్ కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమ్మ..  ఇలాంటి ఇతి వృత్తంతో అర్జున్ హీరోగా జెంటిల్మెన్ గతంలో తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా అప్పటి సినిమాలోని ఘటన నేడు తమిళనాడులో రియల్ గా జరిగింది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ఏకంగా తన ప్రాణాలనే త్యాగం చేసింది.

సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలి గా పనిచేస్తోంది. భర్తనుంచి విడిపోయి తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. కష్టపడి కొడుకును చదివిస్తోంది. తన కొడుకు పెద్ద చదువులు చదవాలని, అతనికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని కలలు కంది. కానీ తనకు వచ్చే జీతంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారంగా మారాయి. అయినా వెనకడుగు వేయలేదు. కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బుల్లేక, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం కోసం బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే ప్రభుత్వం 45 వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది.. దాంతో తన కొడుకు చదువు కొనసాగుతుందని భావించిన పాపాతి వేగంగా దూసుకొస్తున్న బస్సుకు ఎదురెళ్లింది.. బస్సు ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

ఇవి కూడా చదవండి

తాను మరణిస్తే ఆ వచ్చే డబ్బుతో కొడుకు చదువు కొనసాగుతుందని పాపతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషాద ఘటన రోడ్డు పక్కన ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో అన్నిటి ప్లాట్ ఫామ్ లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లను కన్నీరు పెడుతున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బస్సు కింద పడడానికి పాపాతి రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి బస్సు కింద పడేందుకు పాపతి ప్రయత్నిస్తే.. అప్పుడు ఓ బైక్ ఢీ కొట్టింది. తర్వాత కాసేపటికి మళ్లీ బస్సుకు ఎదురువెళ్లింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

యాక్సిడెంట్‌లో చనిపోతే తన కుటుంబానికి రూ.45,000 అందజేస్తానని ఎవరో తప్పుదోవ పట్టించడంతో ఆ మహిళ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కుమారుడి కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బు లేకపోవడంతో తన జీవితాన్ని ఇలా ముగించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..