AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వినాయకుడు కూడా విదేశాల నుంచే వస్తున్నాడు! ఎంత లాభం వస్తున్నా.. విదేశీ వస్తువులు అమ్మొద్దు

ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో విదేశీ వస్తువుల పెరుగుతున్న వినియోగాన్ని గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గణేష్ విగ్రహాలు, హోళీ రంగులు, చిన్న చిన్న వస్తువుల వరకు విదేశీ ఉత్పత్తులే వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, విదేశీ వస్తువులపై ఆధారపడకుండా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

PM Modi: వినాయకుడు కూడా విదేశాల నుంచే వస్తున్నాడు! ఎంత లాభం వస్తున్నా.. విదేశీ వస్తువులు అమ్మొద్దు
Pm Modi
SN Pasha
| Edited By: |

Updated on: May 27, 2025 | 2:04 PM

Share

విదేశీ వస్తువులు మన జీవితాల్లోకి ఎంతలా చొచ్చుకొస్తున్నాయనే అంశంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాలు, హోళీ రంగులు, ఆఖరికి పిన్నులు కూడా విదేశాల నుంచే వస్తున్నాయంటూ మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌ పర్యటన సందర్భంగా ఓ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “ఎంత లాభం వస్తున్నా విదేశీ వస్తువులను అమ్మబోమని వ్యాపారులతో ప్రతిజ్ఞ చేయించాలి. కానీ దురదృష్టవశాత్తు, గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండి వస్తున్నాయి. కళ్ళు కూడా సరిగ్గా తెరవని చిన్న కళ్ల గణేష్ విగ్రహాలు. హోలీ సందర్భంగా మన చల్లుకునే రంగులు కూడా విదేశీ ఉత్పత్తులే వస్తున్నాయి.

ఆపరేషన్ సిందూర్ కోసం.. ఒక పౌరుడిగా నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇంటికి వెళ్లి ఉదయం నుండి మరుసటి ఉదయం వరకు 24 గంటల్లో మీరు ఎన్ని విదేశీ ఉత్పత్తులను ఉపయోగిస్తారో లెక్కించండి. అప్పుడు తెలుస్తుంది.. విదేశీ వస్తువులు మన జీవితాల్లోకి ఎంత వచ్చేశాయో. కొన్నిసార్లు మీరు తెలియకుండానే దువ్వెనలు లేదా హెయిర్‌పిన్‌లు, టూత్‌ పిక్‌ వంటి విదేశీ వస్తువులను ఉపయోగిస్తారు..” అని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనికుల పని మాత్రమే కాదని, అది 140 కోట్ల మంది ప్రజలది కూడా అని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..