ప్రముఖుల నివాళి… 2001 భారత పార్లమెంట్‌పై దాడి… అమర జవాన్లకు ప్రధాని, అమిత్ షా పుష్పాంజలి….

భారత పార్లమెంట్‌పై డిసెంబర్ 13, 2001న ముష్కరులు దాడి చేయగా, ఆ దాడిలో అసువులు బాసిన అమరులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు.

ప్రముఖుల నివాళి... 2001 భారత పార్లమెంట్‌పై దాడి... అమర జవాన్లకు ప్రధాని, అమిత్ షా పుష్పాంజలి....
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 13, 2020 | 3:21 PM

భారత పార్లమెంట్‌పై డిసెంబర్ 13, 2001న ముష్కరులు దాడి చేయగా, ఆ దాడిలో అసువులు బాసిన అమరులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ… భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిని దేశం ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. దేశ ప్రజాస్వామ్య రక్షణలో ప్రాణ త్యాగానికి వెనకాడని వారి తెగువని స్మరించుకుంటున్నామని తెలిపారు. దేశం అమరులకు రుణపడి ఉంటుందని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2001 పార్లమెంట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవానులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటామని తెలిపారు.

కాగా, డిసెంబర్ 13, 2001న సాయుధులైన ఐదుగురు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పార్లమెంట్‌ భవనంపై విచక్షణరహితంగా కాల్పులకు దిగారు. ఈ దుర్ఘటనలో 14 మంది అమరులైయ్యారు. వారిలో ఒకరు పౌరుడు కాగా, 13 మంది సైనికులు బలయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ దాడి కొనసాగింది. కాగా, ఆ సమయంలో భారత పార్లమెంట్‌లో 100 మందికి పైగా సభ్యులున్నారు.