కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. ఇక డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు జారీ
ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, డిజిటల్ ఓటరు కార్డులను
ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, డిజిటల్ ఓటరు కార్డులను జారీ చేయాలంటూ ప్రజలతో పాటు రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారుల నుంచి సలహాలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్, వెబ్ సైట్, ఈ-మెయిల్ ద్వారా డిజిటల్ ఐడీలను త్వరగా పొందేందుకూ, వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
అయితే సాధారణ కార్డులను ముద్రించి ప్రజలకు అందించడం ఇబ్బందికరమైన ప్రక్రియని అధికారులు వ్యాఖ్యనిస్తున్నారు. డిజిటల్ కార్డులకు సాంకేతిక భద్రత ఉంటుందా..? లేక దుర్వినియోగమవుతుందా.? అన్న విషయాలను పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓటరు కార్డులను కూడా డిజిటల్ విధానంలో అందించాలని ఎన్నికల సంఘానికి వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ కార్డులు అందించే విషయమై ఎన్నికల సంఘం యోచిస్తోంది.