PM Modi: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

హైదరాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు...

PM Modi: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
Pm Modi
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 23, 2022 | 11:36 AM

హైదరాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి(PMNRF) నుంచి ఒక్కొక్కరికి 2 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. ” హైదరాబాద్‌ (Hyderabad) లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేస్తాం ” అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సికింద్రాబాద్‌ బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్‌ బోయిగూడలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో బిహార్‌ కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ను ఆదేశించారు.

Also Read

Novavax: నొవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి.. ఆ వయస్సు వారికి అందుబాటులోకి టీకా

Bike Stunt Video: బైక్‌పై స్టంట్‌ చేయబోయాడు.. కానీ సీన్‌ మొత్తం రివర్స్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: కొంపముంచిన బంతి.. క్యాచ్ పట్టాలనుకుంటే దిమ్మతిరిగిపోయింది.. షాకింగ్ వీడియో వైరల్..