Viral Video: వృద్ధ దంపతులు ప్రయాణిస్తున్న బైక్ బ్రేకులు ఫెయిల్.. ఆపద్భాందవుడిలా వచ్చిన యువకుడు..
ఎవరికైనా జీవితంలో బతకాలని రాసివుంటే ఎంతటి ప్రమాదం పొంచివున్నా.. బతికి బయట పడతారు. పూణేలోని వృద్ధ దంపతులకు ఈ మాట నిజమైంది.
Viral Video: ఎవరికైనా జీవితంలో బతకాలని రాసివుంటే ఎంతటి ప్రమాదం పొంచివున్నా.. బతికి బయట పడతారు. పూణే(Pune)లోని వృద్ధ దంపతులకు ఈ మాట నిజమైంది. ఇలాంటి ఘటన మహారాష్ట్ర(Maharashtra)లో చోటు చేసుకుంది. తాజాగా బ్రేక్ ఫెయిల్(Break Fail) కావడంతో బైక్ యాక్సిడెంట్ అవుతుందేమోనని దంపతులు భయపడ్డారు. అయితే, అటుగా నడుచుకుంటూ వెళ్తున్న యువకుడి శ్రద్ధతో పెను ప్రమాదం తప్పింది. ఇది ఇందాపూర్ జంక్షన్ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇద్టరు వృద్ధ దంపతులు తృటిలో తప్పించుకున్న ఓ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు హృదయాలను కదిలిస్తున్నాయి.
ఇందాపూర్‌లో ఓ వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఉన్నట్టుండీ వారి బైక్ బ్రేకులు ఫెయిలయ్యాయి. ఈ సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి వారి బైక్ వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. అతికష్టం మీద బైక్‌ను అదుపు చేసి ఆపేశాడు. దాంతో వృద్ధ దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. యువకుడి పరిస్థితి వల్ల పెను ప్రమాదం తప్పిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన పూణె జిల్లాలోని ఇందాపూర్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో చూడండి: