AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్ లో 50 ఏళ్ళు దాటినవారికి మూడో వ్యాక్సిన్, ప్రభుత్వ నిర్ణయం, క్రిస్మస్ కల్లా కోవిడ్ ‘నిర్మూలన’!

బ్రిటన్ లో 50 ఏళ్ళు దాటినవారందరికీ  మూడో వ్యాక్సిన్ ఇవ్వాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నిర్ణయించింది. క్రిస్మస్ పండుగ కల్లా దేశంలో కోవిడ్ నిర్మూలన జరగాలని ప్రభుత్వం భావిస్తోంది...

బ్రిటన్ లో 50 ఏళ్ళు దాటినవారికి మూడో వ్యాక్సిన్, ప్రభుత్వ నిర్ణయం, క్రిస్మస్ కల్లా కోవిడ్ 'నిర్మూలన'!
People Aged Over 50 Tobe Offered 3 Rd Vaccine
Umakanth Rao
| Edited By: Ravi Kiran|

Updated on: May 05, 2021 | 2:24 PM

Share

బ్రిటన్ లో 50 ఏళ్ళు దాటినవారందరికీ  మూడో వ్యాక్సిన్ ఇవ్వాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం నిర్ణయించింది. క్రిస్మస్ పండుగ కల్లా దేశంలో కోవిడ్ నిర్మూలన జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ పర్యవేక్షణలో రెండు ఆప్షన్ల ట్రయల్స్ జరుగుతున్నట్టు టైమ్స్ పత్రిక తెలిపింది. కొత్త వేరియంట్లను అదుపు చేసేది ఒకటి కాగా ..మూడు వెర్షన్స్ లో ఒకటైన వేరియంట్ ను కంట్రోల్ చేయడానికి మరోకటి  ఉద్దేశించినదని ఈ మ్యాగజైన్ వెల్లడించింది. ఇప్పటికే ఫైజర్ బయో ఎన్ టెక్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా, లేదా మోడెర్నా వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. దేశంలో 36. 6 మిలియన్లమంది కోవిద్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఎనిమిది వేర్వేరు కోవిద్ వ్యాక్సిన్లు ఉన్నాయని,  వీటిలో కొన్ని డెవలప్ చేసే దశలో ఉన్నాయని ఈ వర్గాలు వివరించాయి. 510 మిలియన్లకు పైగా కోవిడ్ డోసులను ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ఫైజర్ బయో టెక్ నుంచి 60 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ ను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇదే సమయంలో 10 కోట్ల డోసుల టీకామందు కోసం కూడా ప్రభుత్వం అర్దర్లు  ఇచ్చింది. అంటే ఎంత త్వరగా తమ దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేయాలా అని జాన్సన్ ప్రభుత్వం యోచిస్తోంది.

నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ వంటి రాష్ట్రాల్లో ఆయా వయస్సుల వారిని బట్టి, వారిని వర్గీకరించి వ్యాక్సిన్ కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవలసిందిగా అధికారులు కోరారు. దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. టాప్ ప్రయారిటీ గ్రూప్ లో ప్రతివారికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. జులై మాసాంతానికి మరో 21 మిలియన్ల మందికి టీకామందు ఇవ్వాలని,, దశలవారీగా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్  చేయాలనీ అధికారులు యోచిస్తున్నారు .ఇదంతా చూస్తే దేశంలో కోవిద్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది.  ఇండియా కూడా ఈ విధమైన పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిపుణులు కోరుతున్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : సింహాలకు కరోనా పాజిటివ్.. మూగజీవులను సైతం వణికిస్తున్న కరోనా వెరైటీ వైరల్ వీడియో ..: Lion Covid Positive. viral video: రెండో ఎక్కం కూడా రాని వరుడు.. పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!