ఆక్సిజన్ లేక కోవిడ్ రోగుల మరణం ‘మారణకాండ’ లో భాగమే, అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లభించక కోవిడ్ రోగులు మరణించడం'మారణకాండ' తో సమానమేనని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది 'క్రిమినల్ యాక్ట్' అని అభివర్ణించింది. లక్నో, మీరట్ జిల్లాల్లోని...
హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లభించక కోవిడ్ రోగులు మరణించడం’మారణకాండ’ తో సమానమేనని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ‘క్రిమినల్ యాక్ట్’ అని అభివర్ణించింది. లక్నో, మీరట్ జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక పలువురు రోగులు మృతి చెందారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ‘పిల్’ దాఖలు కాగా దాన్ని విచారించిన సందర్భంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూసేందుకు నియుక్తులైన అధికారుల వైఫల్యమే ఇదని, ఇది మారణకాండకు తక్కువేమీ కాదని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు సిధార్థ వర్మ, అజిత్ కుమార్ లతో కూడిన బెంచ్..రాష్టంలో కోవిద్ పరిస్థితి పైన క్వారంటైన్ సెంటర్ల దుస్ధితిపైన దాఖలైన ఈ పిల్ పై విచారణ జరిపింది. కోవిద్ రోగులకు నిరంతరం లిక్విడ్ ఆక్సిజన్ లభించాల్సి ఉందని, ఇది సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని బెంచ్ తెలిపింది. గుండె మార్పిడులు, బ్రెయిన్ సర్జరీలు జరుగుతూ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఆక్సిజన్ కొరత ఏమిటని కోర్టు ప్రశ్నించింది. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా తాము రాష్ట్ర, జిల్లా అధికారులను ఆదేశించలేమని, కానీ ఈ పిల్ తరఫున వాదిస్తున్న లాయర్లు ఈ న్యూస్ ని ధృవీకరిస్తున్నారని న్యాయమూర్తులు అన్నారు.
లక్నో,మీరట్ జిల్లాల మేజిస్ట్రేట్లు 48 గంటల్లోగా ఈ వార్తలపై విచారణ జరపాలని, ఆ తరువాత తమ నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగె ఉన్నట్టు కనిపిస్తోందని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఈ రెండు జిల్లాల మేజిస్ట్రేట్లు వర్చ్యువల్ గా విచారణకు హాజరు కావలసి ఉంటుందన్నారు. ఆక్సిజన్ సప్లయ్ లేదన్న కారణంగా ఈ జిల్లాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో రోగులకు సిలిండర్లు తొలగించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అటు ఢిల్లీ హైకోర్టు కూడా ఆక్సిజన్ కొరతపై కేంద్రాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. కేంద్రానికి షో కాజ్ నోటీసును కూడా కోర్టు జారీ చేసింది. మరిన్ని చదవండి ఇక్కడ : సింహాలకు కరోనా పాజిటివ్.. మూగజీవులను సైతం వణికిస్తున్న కరోనా వెరైటీ వైరల్ వీడియో ..: Lion Covid Positive. viral video: రెండో ఎక్కం కూడా రాని వరుడు.. పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!