RBI Governor Shaktikanta Das: బ్యాంకులకు కోవిడ్ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స సంస్థలకు గుర్తింపు
RBI Governor Shaktikanta Das: స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో నిర్వహణ కింద రూ. 10 వేల కోట్లను అందిస్తామని, గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం.
RBI Governor Shaktikanta Das: స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో నిర్వహణ కింద రూ. 10 వేల కోట్లను అందిస్తామని, గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియంను ప్రకటిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో పెరిగిపోతోందన్నారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని అన్నారు. అయితే కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉందని ఆయన అన్నారు. బలమైన ఆర్థిక పునరుద్దరణ వైపు సాగుతున్న నేపథ్యంలో తాజా సంక్షేభాన్ని ఎదుర్కొనే స్థితికి మరిందన్నారు. ప్రస్తుతం సెకండ్‌వేవ్‌తో పోరాడుతున్నామని అన్నారు. కరోనా మహమ్మారిలో ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే మే 20న రెండో సారి 35 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల జరిగినట్లు చెప్పారు. బ్యాంకులకు కోవిడ్ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స్ సంస్థలకు గుర్తింపు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగ సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనవంతు సహకారాన్ని అందిస్తుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
తదుపరి ఏడాది పాటూ, ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్ డౌన్ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. ఇండియాలో కేసుల సంఖ్య 2 కోట్లను దాటిన వేళ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించామన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన కరోనా ఆపై తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించిందని అన్నారు. అయితే, ఇంతవరకూ కేసులు పెరుగుతూనే వచ్చాయి తప్ప, నియంత్రణా చర్యలు కనిపించలేదని ఆయన అన్నారు. ఇక కరోనాను పారద్రోలేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం తమ వద్ద ఉన్న అన్ని వనరులనూ వినియోగిస్తామని అన్నారు. ద్రవ్య లభ్యత నిమిత్తం ఎటువంటి అటంకాలు లేకుండా చూస్తామని, రెపో రేటును మార్చి 2022 వరకూ ఓపెన్ గానే ఉంచుతామని అన్నారు.