AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert for pensioners: పెన్షనర్లకు అలెర్ట్‌.. ఈ నెలాఖరుకల్లా ఈ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే పెన్షన్‌ రాదు..

పెన్షన్‌ తీసుకునేవారు ఏటా లైఫ్‌ సర్టిఫికెట్‌ (LC) లేదా జీవన్‌ ప్రమాణ్‌ పత్రాన్ని కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏటా రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది.

Alert for pensioners:  పెన్షనర్లకు అలెర్ట్‌.. ఈ నెలాఖరుకల్లా ఈ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే పెన్షన్‌ రాదు..
Basha Shek
|

Updated on: Nov 23, 2021 | 4:13 PM

Share

పెన్షన్‌ తీసుకునేవారు ఏటా లైఫ్‌ సర్టిఫికెట్‌ (LC) లేదా జీవన్‌ ప్రమాణ్‌ పత్రాన్ని కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏటా రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పెన్షన్‌ నిలిచిపోతుంది. అలా ఈ ఏడాదికి గాను లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించడానికి నవంబర్‌ 30 వరకు గడువు ఉంది. అందువల్ల పెన్షనర్లు వీలైనంత త్వరగా లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంది. పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరి. కచ్చితంగా పెన్షన్ పొందే పెన్షన్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెన్సీకి ఈ డాక్యుమెంట్‌ను అందించాలి. పెన్షనర్ల జీవించి ఉన్నారనే దానికి ప్రామాణికమే ఈ లైఫ్‌ సర్టిఫికెట్‌. పెన్షనర్లు సంబంధిత పోస్టాఫీసు లేదా బ్యాంక్‌ బ్రాంచుకు వెళ్లి ఈ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. అదేవిధంగా డోర్‌ స్టెప్‌ డెలివరీ సర్వీసుల ద్వారా జీవన్‌ ప్రమాణ్‌ పత్రాన్ని అందించొచ్చు. కొన్ని బ్యాంకు శాఖలు వీడియో కాల్‌ సేవల ద్వారా ఈ సేవలు అందిస్తున్నాయి. ఒకవేల నిర్ణీత సమయానికి సర్టిఫికెట్‌ అందించకపోతే పెన్షన్ రాదు.

ఆన్‌లైన్‌లో డీఎల్‌సీ సమర్పించండిలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ అందుకునే పెన్షనర్లు జీవన్ ప్రమాణ్‌ వెబ్‌సైట్‌ https://jeevanpramaan.gov.in ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించవచ్చు. పెన్షన్‌ దారుని పేరు, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ ఇతర వివరాలు దగ్గర ఉంచుకుని ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్‌ కోసం ఆధార్‌ నంబర్‌తో పాటు ఐరిస్‌ లేదా వేలిముద్రను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ఏవైనా సమస్యలుంటే సమీపంలోని పౌర సేవా కేంద్రం, బ్యాంక్, పోస్టాఫీసులను సందర్శించవచ్చు. అయితే జీవన్‌ ప్రమాణ్‌ వెబ్‌సైట్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించుకోవడానికి ముందు సంబంధిత పెన్షన్‌దారుడు కచ్చితంగా జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకునై ఉండాలి.

జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోండిలా.. పెన్షనర్ ముందుగా జీవన్ ప్రమాణ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో కొత్తగా రిజిస్టర్‌ అవ్వడానికి ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్ (PPO) సమర్పించాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత పెన్షనర్‌ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీనిని ఎంటర్‌ చేసిన తర్వాత ఆధార్‌ అథెంటికేషన్‌ అడుగుతుంది. అప్పుడు ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫైనల్‌గా సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి. దీంతో జీవన్‌ ప్రమాణ్‌ ఐడీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత పెన్షనర్ మరొక OTPని ఉపయోగించి యాప్‌లో లాగిన్‌ కావాలి. ‘Generate Jeevan Pramaan’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆధార్, మొబైల్, PPO నంబర్లు, పేరు, పెన్షన్‌ పంపిణీ చేసే ఏజెన్సీ పేరు తదితర వివరాలను అందులో నమోదు చేయాలి. ఆధార్ అథెంటికేషన్‌, ఐరిష్‌, వేలిముద్రలను ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటారు. ఇదంతా పూర్తయిన తర్వాత డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌లో ప్రదర్శితమవుతుంది. అదేవిధంగా డీఎల్‌సీ ప్రక్రియ పూర్తయినట్లు పెన్షనర్‌ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నిర్ధారణ మెసేజ్‌ కూడా వస్తుంది.

Also Read:

ICRA: రానున్న రోజుల్లో ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయ్‌.. క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా..!

Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

All Electric Aircraft: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానం చూశారా? ఎంత స్పీడ్‌తో ప్రయాణించిందో తెలిస్తే షాకే..!